కాంగ్రెస్ ఆశ అంతా గవర్నర్ మీదే ఉంది. పాత గవర్నర్ నిర్ణయాలను తప్పు పడుతూనే... కొత్త గవర్నర్ ని రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ గవర్నర్ ని కలిశారు. గవర్నర్ నిర్వహించాలని అనుకుంటున్నా ప్రజా దర్భార్ ని స్వాగతించింది కాంగ్రెస్.
గవర్నర్ తమిళిసై సౌెందర రాజన్ ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కలిశారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేశారు. గతంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూనే... కొత్త గవర్నర్ సపోర్ట్ పై ఆశలు పెంచుకుంది కాంగ్రెస్. గతంలో ఉన్న గవర్నర్.. టీడీపీ నుంచి గెలిచిన తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారని గవర్నర్ కి వివరించారు. అప్పటి నుంచి... ఫిరాయింపుల ప్రోత్సహం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ టర్మ్ లో కూడా 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరారనీ... వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టులో కేసు ఉండగా... సబితా ఇంద్రారెడ్డి తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గవర్నర్ కు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలనీ.. అనర్హులుగా ప్రకటించి ఎన్నికలు జరపాలని కోరారు.