మానవుడి జీవితానికి ఒక గమనాన్ని దిశానిర్ధేశాన్ని అందించేది జ్ఞానం. ఆ జ్ఞానం మనకు విద్యా బుద్ధులు నేర్చుకోవడం ద్వారా లభిస్తుంది. అయితే చదువుకోదలచిన ప్రతి వ్యక్తికి బోధనాలయాలు కేవలం విద్యను అందించేవి మాత్రమే కాదు ఒకరంగా మనల్ని అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో పరిపూర్ణులుగా తయారుచేసే దేవాలయాలు అని అనాలి. ఇక మనకు విద్యను బోధించే ఉపాధ్యాయులు దైవంతో సమానం అని మన పెద్దలు చెప్పాకనే చెప్పారు. 

మరి అటువంటి దేవాలయాల వంటి విశ్వవిద్యాలయాలే సాటి మనుషుల పాలిట శిక్షణాలయాలుగా తయారైతే, అక్కడ  విద్యని అభ్యసించే విద్యార్థులకు ఇంక సరైన విద్య ఎక్కడ లభిస్తుంది చెప్పండి. కొద్దిరోజుల క్రితం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఒక అమాయకుడైన వికలాంగుని, ఆ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ మరియు ఇంచార్జి రిజిస్ట్రార్ కలిసి ఎంతో క్రూరంగా చిత్రహింసలకు అతడిని గురిచేసి నానా ఇబ్బందులకు గురిచేయడం క్రితం పెద్ద సంచలనంగా మారింది. వాస్తవానికి అతడు విశ్వవిద్యాలయ పెండింగ్ బిల్లుల విషయమై అక్కడికి వెళ్లగా, 

ఆ సమయంలో అతడిని రిజిస్ట్రార్ గారి గదికి పిలిపించి, రిజిస్ట్రార్ మరియు ఇంచార్జి రిజిస్ట్రార్ సహా మరికొంతమంది అధ్యాపక సిబ్బంది కలిసి అతడిని పలు విధాలుగా దుర్భాషలాడి, ఆపై అతడిని రకరకాలుగా బెదిరించి కొన్ని బలవంతపు సంతకాలు తీసుకోవడం జరిగింది. వికలాంగుడైన అతడి పరిస్థితిని చూసి కనీసం కనికరం కూడా లేకుండా, ఆ విధంగా కర్కశంగా వ్యవహరించిన విశ్వవిద్యాల సిబ్బందిపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇప్పటికి కూడా వారి నుండి ఆ విషయమై సరైన సమాధానం రాకపోవడం దారుణం అని పలువురు అక్కడి విద్యార్థులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పెద్దగా బయటకు రాకపోవడానికి, అలానే విశ్వవిద్యాల సిబ్బంది ఈ ఘటనపై ఇప్పటికి కూడా వివరణ ఇవ్వకపోవడానికి ఒక కారణం ఉందట. అదేమిటంటే, ఆ విశ్వవిద్యాలయంలోని వారు అధికార పార్టీ యొక్క అండదండలు కలిగి ఉండడమే అని సమాచారం. మరి ఇకనైనా ఆ వ్యక్తికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: