చంద్రబాబునాయుడుకు
రివర్స్ టెండర్ పెద్ద షాకే ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టులోని హెడ్ వర్క్స్, హైడల్
ప్రాజెక్టు ప్రభుత్వం పిలిచిన రివర్స్ టెండర్లో రూ. 628 కోట్ల ప్రజాధానం ఆదా
అయ్యింది. మంగళవారం ఓపెన్ చేసిన రివర్స్ టెండర్లో మేఘా ఇన్ ఫ్రా కంపెనీ రూ. 4359
కోట్లకే పనులను దక్కించుకున్నది. ఇదే పనిని చంద్రబాబు హయాంలో నవయుగ కంపెనీ రూ.
4987 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
జగన్ పట్టుదల వల్ల రివర్స్ టెండర్లు పిలవటంతో మేఘా కంపెనీ 12.6 శాతం లెస్ తోనే పనులను దక్కించుకోవటంపై ప్రతిపక్షాలు ఏమీ కామెంట్ చేయలేకపోతున్నాయి. అదే సమయంలో కేంద్రప్రభుత్వం కూడా నోరెత్తలేకపోతోంది. మొదటి నుండి కూడా రివర్స్ టెండర్ విధానాన్ని ఇటు కేంద్రప్రభుత్వంతో పాటు అటు చంద్రబాబు అండ్ కో విపరీతంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఎవరు ఎంతగా వ్యతిరేకించినా జగన్ మాత్రం తన రివర్స్ టెండర్ పై ముందుకే వెళ్ళారు. రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టులోని 65వ ప్యాకేజి పనులకు పిలిచిన టెండర్లలో కూడా 58 కోట్ల రూపాయలు మిగిలిన విషయం తెలిసిందే. అప్పుడేమో చంద్రబాబు హయాంలో 4.77 శాతం ఎక్సెస్ ధరలకు పనులకు దక్కించుకున్న మ్యాక్ ఇన్ ఫ్రా జగన్ హయాంలోకి వచ్చేసిరికి 15.6 శాతం తక్కువే కోట్ చేసి పనులను దక్కించుకోవటం విశేషం.
ఇప్పటి వరకూ జరిగిన రెండు రివర్స్ టెండర్లలో సుమారు రూ. 730 కోట్ల ప్రజాధనం ఆదా అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మిగిలిన అన్నీ ప్రాజెక్టుల్లో కూడా రివర్స్ టెండర్లు పిలిస్తే ప్రభుత్వానికే ఉపయోగమన్న విషయం తెలిసిందే. అయితే ఈ విధానాన్ని చంద్రబాబు, కేంద్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ? ఎందుకంటే చంద్రబాబు అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న టెన్షనే కారణంగా తెలుస్తోంది. రివర్స్ టెండర్లను వ్యతిరేకించటానికి చంద్రబాబుకున్న కారణం తెలుస్తోంది. మరి కేంద్రం కూడా ఎందుకు వ్యతిరేకిస్తోంది ?