మాజీ మంత్రి, ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంతటి గడ్డు పరిస్దితిని గతంలో ఎదుర్కొని ఉండరు. పార్టీలో ఉండాలా ? లేకపోతే రాజీనామా చేసేయాలా ? అన్న విషయం తన భార్య నిర్ణయంపై ఆధారపడి ఉండటం దగ్గుబాటికి పెద్ద సంకటంగా మారింది. తాను వైసిపిలో కంటిన్యు అవ్వాలంటే భార్య పురంధేశ్వరి కూడా వెంటనే వైసిపిలో చేరాలంటు జగన్ పెట్టిన కండీషన్ దగ్గుబాటిని బాగా ఇరకాటంలోకి నెట్టేస్తోంది.

 

నిజానికి దగ్గుబాటి వైసిపిలో ఉన్నా, పురంధేశ్వరి బిజెపిలో ఉన్నా పెద్ద తేడా ఏమి కనబడటం లేదు. ఎందుకంటే ఇద్దరి పరిస్ధితి పార్టీపరంగా ఒకటేలా ఉంది. ఇద్దరు కూడా చరిత్రను నెమరేసుకోవటం తప్ప ఇపుడు చేస్తున్నదేమీ లేదు. ఇద్దరు మాజీ మంత్రులే. దగ్గుబాటి ఒకపుడు ఎన్టీయార్ హయాంలో మంత్రిగా కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. పురంధేశ్వరి కూడా కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో మంత్రిగా చేశారు.

 

ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రాభవం కేంద్రంలో పోయిందో వెంటనే పురంధేశ్వరి బిజెపిలోకి జంప్ చేశారు. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడవటంలో దగ్గుబటి పాత్ర కూడా తక్కువేమీ కాదు. అయితే తర్వాత చంద్రబాబునాయుడు నమ్మక ద్రోహం చేయటంతో టిడిపిలో ఇమడలేక బయటకు వచ్చేశారు. అప్పటి నుండి రాజకీయంగా దాదాపు కనుమరుగైపోయినట్లే లెక్క.

 

అలాంటిది  మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందాలనకున్న దగ్గుబాటి వైసిపిలో చేరారు. చేరేటపుడు ఏం మాట్లాడుకున్నది తెలీదు. ఎందకంటే అప్పటికే పురందేశ్వరి బిజెపిలో ఉన్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో దగ్గుబాటి ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. దానికితోడు ఎన్నికల సమయంలో టిడిపిలో చేరిన రావి రామనాధంబాబు మళ్ళీ వైసిపిలో చేరి బాగా యాక్టివ్ అయిపోయారు. దాంతో దగ్గుబాటిలో టెన్షన్ మొదలైపోయింది.

 

తన భవిష్యత్తుపై భేటి అయిన దగ్గుబాటిని జగన్ ఇరకాటంలో పడేశారట. దగ్గుబాటి వైసిపిలో ఉండదలచుకుంటే భార్య పురంధేశ్వరిని కూడా వెంటనే బిజెపికి రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకురావాలని గట్టిగా చెప్పారట. ఒకవేళ పురంధేశ్వరి రాకపోతే ? అప్పుడు వైసిపిలో కంటిన్యు అయ్యే విషయంలో దగ్గుబాటే నిర్ణయం తీసుకోవాలని కూడా జగన్ చెప్పేశారట. ఇదే ఇపుడు దగ్గుబాటికి సంకటంగా మారింది. మరి ఏం చేస్తారో చూడలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: