జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ఆరోపణలు చూస్తుంటే అందరిలాగే అనిపిస్తోంది. హై కోర్టులో సౌకర్యాల కొరత విషయంలో న్యాయమూర్తి చేసిన కామెంట్లకు కూడా జగన్మోహన్ రెడ్డే బాధ్యుడన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు.  నిజానికి న్యాయమూర్తి చేసిన ప్రతి కామెంట్ కు జవాబు చెప్పాల్సింది చంద్రబాబునాయుడే అన్న విషయం అందరికీ తెలిసిందే.  ఎందుకంటే హై కోర్టుకు కూడా తాత్కాలిక నాసిరకం నిర్మాణాన్ని చేసింది చంద్రబాబు కాబట్టే.

 

హై కోర్టు తాత్కాలిక భవనాన్ని నిర్మించింది కూడా చంద్రబాబే అన్న విషయం అందరికీ తెలిసినా పవన్ మాత్రం జగన్ దే బాధ్యత అన్నట్లు మాట్లాడుతున్నారు. పవన్ మాట్లాడిన మాటలు విన్నవారికి చంద్రబాబు మాయ జనసేనాధిపతిని ఏ స్ధాయిలో కమ్మేసిందో అర్ధమైపోతోంది.

 

తప్పు ఒకళ్ళు చేస్తే ఇంకోరు ఎలా బాధ్యత వహించాలో పవనే చెప్పాలి. హైదరాబాద్ నుండి హై కోర్టును హడావుడిగా విజయవాడకు తరలించింది చంద్రబాబే. హై కోర్టు భవనం నిర్మాణం పేరుతో వందల కోట్లు తగలేసి నాసిరకం నిర్మాణాలు చేశారు. చిన్నపాటి వర్షానికే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం కురిసినట్లే హై కోర్టు కూడా బాగా కురుస్తోంది. మొన్నటి వర్షానికి కోర్టులోని చాలా గదుల్లో నీళ్ళు లీకైన విషయం అందరూ చూసిందే.

 

హై కోర్టు ప్రాంగణంలో కార్లు పర్కింగ్ కు స్ధలం చూపలేదంటే ఎవరి తప్పు. వందలమంతి లాయర్లు, వేలసంఖ్యలో కక్షిదారులు వచ్చే హై కోర్టులో ఓ క్యాంటిన్ పెట్టుకోవటానికి అనువుగా భవనం కూడా చంద్రబాబు ఎందుకు నిర్మించలేకపోయారు ?  మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబును నిలదీయలేకే న్యాయమూర్తి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

నిజానికి న్యాయమూర్తి వేసిన ప్రతి ప్రశ్న చంద్రబాబును ఉద్దేశించిందే. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయ్యిందన్న విషయం న్యాయమూర్తులకు, న్యాయవాదులకు తెలీదా ? అందుకనే తమకు చంద్రబాబా లేకపోతే జగనా ? అన్నదానితో సంబంధం లేదన్నారు. తాము అడుగుతున్నది ప్రభుత్వాన్నే అన్నారంటే ఏమిటర్ధం. ఇంత చిన్న విషయం కూడా పవన్ కు అర్ధం కాలేదంటే....

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: