జగన్ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు పథకాలతో దూసుకు పోతున్న
వైసీపీ ప్రభుత్వం సమాజంలోని వివిధ వర్గాలకు పలు రూపాల్లో పథకాలను చేరువ చేసిన విష యం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరిన్ని పథకాలకు జగన్
కేబినెట్ పచ్చజెండా ఊపింది. తాజాగా జరి గిన
కేబినెట్ సమావేశంలో జగన్ ప్రభుత్వం దీపావళి ముగిసినప్పటికీ.. దీపావళి ధమాకాను మాత్రం ప్రజల కు అందించింది.
తాజాగా తీసుకున్న నిర్ణయాల మేరకు వచ్చే జనవరి నుంచి మళ్లీ రాష్ట్రంలో కొత్తగా అర్హత పొందే పింఛనర్లకు నూతన పింఛన్‌ను ఇవ్వనున్నారు. అదేవిధంగా
జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేటినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు గ్రామీణ నియోజవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేం దుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల, ల్యాబ్‌లో పరీక్షించి రైతు లకు అందజేయాలని కేబినెట్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
రెట్టింపు పోషకాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 77 మండలాల్ల రూ.90 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయా లని కేటినెట్ నిర్ణయించింది. మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇక, మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి అందిన విద్యారంగంపై నిపుణుల కమిటీ సిఫారసులను కూడా కేబినెట్‌లో చర్చించారు.
ప్రైవేటు కాలేజీల దూకుడుకు అడ్డుకట్ట వేయడంతోపాటు.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలను అబివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు అందే మిడ్ డే మీల్స్ విషయంలో నాణ్యత ఖచ్చితంగా ఉండాలని జగన్ ఆదేశించారు. మొత్తంగా దీపావళి ముగిసినా.. ప్రభుత్వం నుంచి సంక్షేమ టపాసులుమాత్రం ఓ రేంజ్‌లో పేలుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.