తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందు ఉన్న దారులు చాలా తక్కువ... రాష్ట్రంలో ఆయనపై ప్రజల్లో నమ్మకం ఉందో లేదో తెలియదు గాని ఆయన అనుకూల
మీడియా మాత్రం ఆయనకు అనుకూలంగా కథనాలు రాయకపోయినా,
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారు. దీనిని చూసి అంతా తమకు అనుకూలంగా మారుతుంది అనే భ్రమలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. రాజకీయంలో చంద్రబాబు వ్యూహాలకు ఇప్పుడు కాలం చెల్లింది... ఈ మాట
టీడీపీ నేతలే తమ అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తూ ఉంటారు.
ఇప్పుడు చంద్రబాబు తన మనుగడను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారం లేక కొంత కాలంగా ఇబ్బంది పడుతున్న చంద్రబాబు ఇప్పుడు తనను తాను రక్షించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు,
జగన్ ని ఎదుర్కోవడానికి గానూ ఆయన ఇప్పుడు మళ్ళీ జాతీయ స్థాయిలో అడుగులు వేస్తున్నారు. తనతో గతంలో సన్నిహితంగా ఉండి, తన ప్రభుత్వంలో లాభం పొందిన కొందరు పారిశ్రామిక వేత్తలను కలవడానికి ఆయన సిద్దపడ్డారు. ఇప్పటికే సంఘ్ చీఫ్
మోహన్ భగవత్ ని చంద్రబాబు కలిసారు అనే వార్తలు రాజకీయ వర్గాల్లో వచ్చాయి.
ఇక
హైదరాబాద్ లో వారాంతంలో ఉంటున్న చంద్రబాబు, బిజెపికి సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్తలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆయన
మోడీ సన్నిహితుడు గౌతం అధానీని కలిసారని సమాచారం. అలాగే
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
ముఖేష్ అంబానిని కూడా కలవడానికి చంద్రబాబు రహస్య ప్రయత్నాలు చేస్తున్నారు.
అక్కడితో ఆగని బాబు అటు
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు అయిన మై హోం రామేశ్వరరావుతో పాటు తెలంగాణలోనూ పలువురు పారిశ్రామికవేత్తల ద్వారా లాబీయింగ్ నడుపుతున్నారట. ఏదేమైనా బాబు తనను తాను రక్షించుకోవడంతో పాటు
జగన్ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆయన ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నారు. మోడీతో మళ్ళీ సాన్నిహిత్యం కోసం చంద్రబాబు అడుగుల వేగం పెంచారు.