గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఉన్నపళంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రాధాన్య పదవిలోకి బదిలీ చేసిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కి స్వేచ్ఛ ఉంటుంది. కానీ మరి ఇంత అసందర్భంగా ఇష్టారీతిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయడం ఎవరూ ఊహించని సంఘటన. ఇదంతా ముఖ్యమంత్రి జగన్ కి తెలిసి జరిగిందా ? జగన్ ప్రమేయం ఎంత ? మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైనా ఎలాగైనా బదిలీ చేయొచ్చా ? 


ఇక  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే రాష్ట్రంలో అన్ని శాఖలకు అధిపతిగా ముఖ్యమంత్రికి సహాయకుడిగా ఉండి ఒకరకంగా ప్రభుత్వాధినేతగా పరిపాలనను కొనసాగించే పదవి. అలాంటి ప్రధాన కార్యదర్శి నియామకం సహజంగా రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులలో ఒకరిని ముఖ్యమంత్రి సలహామేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నియమిస్తారు. కేంద్రం తో పోల్చినప్పుడు రాష్ట్రంలో పరిపాలన కొద్దిగా తేడాగా ఉంటుంది.ఎందుకంటే కేంద్రంలో లో సి ఎస్ ఉండరు. 


సహజంగా అ రాష్ట్రంలో ఉన్న అన్ని విభాగాలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మంత్రులు ఉంటారు. ఆ మంత్రులకు శాఖాపరమైన సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రెటరీ లాగా ఉంటారు ఇలా అన్ని శాఖల పై అధికారాన్ని కలిగి ఉండగలిగేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిఇతని ఆదేశాల మేరకు ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే రాష్ట్రంలోని కింది స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కొనసాగుతారు.


ఇప్పుడేం జరుగుతోంది:  రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పుతుందా ? అంటే కాదని అయితే చెప్పలేని విధంగా ఉంది. ఎందుకంటే పరిపాలన వ్యవస్థలో అధికారులకి వారి పదవిని బట్టి వారి పరిధిలు ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతుంది అంతా ఇష్ట రీతిగా ఉంది. రాష్ట్రంలో అత్యున్నత పదవి కలిగిన వ్యక్తిని ఒక ప్రిన్సిపుల్ సెక్రటరీ స్థాయి అధికారి బదిలీ చేయడం అంటే ఏం జరుగుతుంది.


సహజంగా అయితే పరిపాలన మొత్తం ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుండి జరగాలి కానీ పరిస్థితి చూస్తే ముఖ్యమంత్రి కార్యాలయం లో గల ఒక ప్రిన్సిపుల్ సెక్రటరీ స్థాయి అధికారి అత్యున్నత స్థాయి అధికారిని బదిలీ చేయడం అంటే అసలు రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతుంది అనేది అందరికీ ఉన్న అతి పెద్ద ప్రశ్న. వాస్తవానికి  ముఖ్యమంత్రి కార్యాలయంలో నీ అధికారులందరికీ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉండే అధికారాలు ఉండవు. కానీ ఇక్కడ జరిగింది చూస్తే సీఎంవో వర్సెస్ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ లాగా కనిపిస్తుంది. ఇదంతా ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగిందా అంటే నమ్మాలా..


ముఖ్యమంత్రులు వర్సెస్ చీఫ్ సెక్రటరీ: గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఘటనే మనం అందరం చూశాం అప్పటి ముఖ్యమంత్రి  అప్పుడున్న ప్రధాన కార్యదర్శి అయిన ఇది సుబ్రహ్మణ్యం గారితో వ్యవహరించిన తీరును మరవకముందే అప్పుడు ఇలాంటి తీరుని వ్యవహరించిన ముఖ్యమంత్రిపై తీవ్రమైన విమర్శలు చేసిన ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కానీ అప్పుడు ఇప్పుడు అధికారి ఒక్కరే అధికారంలో ఎవరున్నా ప్రభుత్వ అధికారులతో వ్యవహరించే తీరు మాత్రం ఒక్కటే ఇది దేశానికి ఏ సందేశాన్ని ఇస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: