గురువారం ఉదయం దీక్ష చేయటానికి రెడీ అవుతున్న చంద్రబాబునాయుడుకు రెండు అంశాలు షాక్ ఇచ్చాయి. మొదటిది ఇసుక అక్రమ కొరతకు బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ కంపెనీ హస్తముందని అనుమానంతో దాడులు జరగటం. ఇక రెండోది తెలుగుయువత అధ్యక్షుడు దేవవినేని అవినాష్ టిడిపిని వదిలేయటం.  ఈ రెండు కూడా చంద్రబాబుకు పెద్ద షాకులనే చెప్పాలి.

 

బ్లూఫ్రాగ్ టెక్నాలజీస్ కంపెనీ తో చంద్రబాబు, నారా లోకేష్ కున్న సాన్నిహిత్యం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. గతంలో ఆధార్ కార్డల ద్వారా ఓటర్ల జాబితాలో నుండి ప్రత్యర్ధులకు పడతాయని అనుమానం ఉన్న ఓట్లను తొలగిస్తోందన్న వివాదంలో ఈ కంపెనీ పేరు బాగా వివాదంలో నలిగింది. తెలంగాణా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేద్దామని ప్రయత్నిస్తే యాజమాన్యం  దొరకలేదు లేండి.

 

సరే తర్వాత ప్రభుత్వం మారిపోవటంతో మళ్ళీ ఆ విషయాన్ని అందరూ మరచిపోయారు. మళ్ళీ ఇపుడు హఠాత్తుగా కంపెనీ పేరు బయటకొచ్చింది. ఇసుక ఆన్ లైన్ లో దొరకకుండా ఈ కంపెనీ ప్రభుత్వ సర్వర్ లోకి చొరబడిందట. వెబ్ సైట్ ను హ్యాక్ చేయటం ద్వారా వినియోగదారులను ఇబ్బందులు పెడుతోందనే ఆరోపణలపై విశాఖపట్నంలోని కంపెనీ ఆఫీసుపై సిఐడి అధికారులు దాడులు చేశారు.

 

ఇక రెండో అంశమైన దేవినేని పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈమధ్యనే తాను టిడిపిని వీడటంపై జరిగిన ప్రచారంపై మాట్లాడుతూ బతికున్నంత వరకూ తాను టిడిపిని వదిలేది లేదంటూ గట్టిగా చెప్పారు. మరి ఏమైందో ఏమో వెంటనే టిడిపికి దూరమైపోతున్నారు.

 

ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకుంటారని సమాచారం.  ఇందుకు రంగం సిద్ధమైందని జగన్ ను కలవటమే లాంఛనమని టిడిపి నేతలే చెబుతున్నారు. దీక్ష చేయటం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడదామని అనుకుంటే చివరకు చంద్రబాబుకే షాక్ తగిలేట్లుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: