తీవ్రవాదం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతోందని ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. పదకొండో బ్రిక్స్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన.. ఐదు దేశాల మధ్య 500 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగేలా వచ్చే సమావేశాల నాటికి రూట్ మ్యాప్ రూపొందించాలన్నారు. భారత్ పెట్టుబడి అనుకూల దేశమన్న మోడీ.. ఇక్కడి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ కు పిలుపునిచ్చారు. 


ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. బ్రిక్స్ మీటింగ్ కోసం రెండు రోజుల పాటు బ్రెజిల్లో పర్యటించిన మోడీ.. ఐదు దేశాల మధ్య కోపరేషన్ మరింత పెరగాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బ్రిక్స్ దేశాలే వెలుగు రేఖలని చెప్పారు. వచ్చే మీటింగ్ నాటికి బ్రిక్స్ దేశాల మధ్య 500 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగేలా రూట్ మ్యాప్ రూపొందించాలని బిజినెస్ కౌన్సిల్ కు పిలుపునిచ్చారు. 


తీవ్రవాదం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్ డాలర్ల మేర నష్టం జరిగిందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది బలయ్యారని చెప్పారు. భారత్ ప్రపంచానికి బుద్ధుడ్ని ఇచ్చిందనీ, యుద్ధాన్ని కాదని గుర్తుచేశారు మోడీ. ఇప్పుడు కూడా తీవ్రవాదానికి వ్యతిరేకంగా బలంగా గళమెత్తుతోంది భారతేనని చెప్పారు.  


పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ గమ్యస్థానమన్న మోడీ.. ఇక్కడి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని బ్రిక్స్ బిజినెస్ లీడర్లకు విజ్ఞప్తి చేశారు. భారత్ లో అపరిమత అవకాశాలున్నాయని గుర్తుచేశారు. అటు బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అయ్యారు మోడీ. రెండు దేశాల మధ్య వాణిజ్యలోటును తగ్గించే సూచనలు చేయడానికి.. మంత్రుల కమిటీ వీలైనంత త్వరగా భేటీ అవుతుందని నిర్ణయం తీసుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మామల్లపురం వచ్చినప్పుడు.. భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, చైనా ఉపాధ్యక్షుడు హు చున్ హువా నేతృత్వంలో మంత్రుల కమిటీ వేయాలని నిర్ణయించారు. బ్రిక్స్ సమ్మిట్ ముగియడంతో.. ప్రధాని మోడీ ఢిల్లీ ఫ్లైటెక్కారు. రెండు రోజుల పాటు ఆయన బ్రెజిల్ లో పర్యటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: