ఢిల్లీ లో ఏపీనే ఇప్పుడు హాట్ టాపిక్ అంటూ సరికొత్త - చెత్త వైరల్ మెస్సేజ్ !

 

ఇన్ని అబద్దాలా ? ఇంత దుగ్ధా ? ఇంత కసి - కోపమా ? ఇంత ఏహ్యభావమా ?

 

మొన్నటి వరకూ భాజపా డైరెక్షనన్నారు, ఇప్పుడేమో భాజపా తో వైసిపి యుద్దం అంటున్నారు... అస్సలు వీరు తినేది అన్నమేనా అంటున్న ఆంధ్రప్రజ?

 

ఆర్ధిక నేరస్తుల బెయిల్ లను రద్దు చెయ్యాలని కేంద్ర హోమ్ శాఖ నిర్ణయంతో, తన బెయిల్ రద్దు  ఖాయం అని నిర్ణయించు కున్న అన్న వేగంగా పావులు కదుపుతున్నాడు. తనకు బాగాదగ్గిరగా వుండే, ఏపీ/తెలంగాణ, బీజేపీ పెద్దలతో షా వద్దకు రాయబారంపంపాడు. తన బెయిల్ క్యాన్సిల్ అయితే తన భార్య ఏపీ సిఎం అవటానికి సహకరించాలని కోరాడు. 

 

ఏపీ లో పరిస్తితులు, జగన్ కుటుంబంలోని ఇంటిపోరు తెలిసిన కేంద్రం, జగన్ భార్య ఏపీ సిఎం కావటం కష్టం అని చెప్పినట్టు సమాచారం. దీనికి మారుగా తాము సూచించిన వారిని సీఎం చేస్తే సహకరిస్తామని చెప్పారు. కేంద్రపెద్దలు తనకు సహక రించరు అని అర్ధం చేసుకున్న అన్న కేంద్రానికి ఒక హెచ్చరిక పంపాడు. తన భార్య సీఎం కాకపోతే, మొత్తం తన ఎంఎల్ఏ లు రాజీనామా చేస్తారని, ఉపఎన్నికలు జరపాల్సి వస్తుందని, అంతేకాక, తన 22 మంది ఎంపీ ల చేత, 'ప్రత్యేక హోదా' సాకుతో రిజైన్ చేయిస్తానని హెచ్చరికలు పంపాడు.

 

ఈహెచ్చరిక పంపటానికి అన్న ధైర్యం కేంద్రానికి తెలుసు. 

 

*బీజేపీ కి ఏపీ లో సరైన బలం లేదు.

 

*వైసీపీ ఈ ఆరు నెలల్లో తనబలాన్నీ క్రిస్టియన్ మైనారిటీలలో, ఎస్సి,బీసీలలో వ్యూహాత్మకంగా బలం పెంచుకుంది.తిరిగి జగన్ జైల్ కి వెడితే పై వర్గాల్లో  సానుభూతి తో మళ్ళీ గెలుస్తుంది అని సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి.

 

*ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరగటం, టీడీపీ బలపడటం, తిరిగి ఎన్నికలకు వెడితే,టీడీపీ ప్రభుత్వం పవర్ లోకి వచ్చే అవకాశం ఉందని గ్రహించింది.

 

 ఇది  జరుగుతుండగా---


 
రెండు రోజుల క్రితం షా, ఆర్ఎస్ఎస్, మీటింగ్ లో, ఆరెస్సెస్ జగన్ ప్రభుత్వం మీద చాలాతీవ్రంగా ఫిర్యాదు చేసింది. వీరికి కొంతమంది ఏపీ బీజేపీ ముఖ్య నాయకులు కూడా గొంతు కలిపారు. జగన్ ప్రభుత్వం హిందు ధర్మానికి వ్యతిరేకం అని, గుడి గోపురాల ఆస్తుల్ని క్రైస్తవులకు దోచిపెడు తున్నారని, మతమార్పిడులు, హిందు సమాజంలో ప్రభుత్వ వ్యతిరేకత,రాష్ట్ర పరిపాలన గాడి తప్పటం  వగైరా అన్ని విషయాల మీద ఫిర్యాదు చాలాబలంగా చేసింది. వైసీపీ ని కట్టడి చేయాలని లేదా........ చెయ్యాలని ఖచ్చితంగా చెప్పింది. 

 

దీనికి తోడుగా, నేషనల్ మీడియా ప్రతినిధులు కూడా ఏపీ ప్రభుత్వ మీడియా ఆంక్షల మీద పీఎం కి ఫిర్యాదులు చేశాయి.

 

ఒక సిమెంట్ ఇండస్ట్రీ జయింట్ నాయకత్వంలో, పెద్ద పెద్ద పారిశ్రమికవేత్తలుకూడా, ఏపీ లో తాము బ్లాక్ మైల్ చేయబడు తున్నామని ఇంకో ఫిర్యాదు చేశారు.

 

అన్ని విషయాలు చాలా సీరియస్ గా తీసుకున్న కేంద్రం పార్లమెంట్ లో ఒక ప్రకటన చేసేందుకు కూడా ఆలోచించింది. ఐతే బెయిల్ క్యాన్సల్ అయ్యేవరకు వేచిచూడాలి నిర్ణయించుకుంది.

 

ఏపీ లో చాప కింద నీరులా పాకుతున్న ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా, వైసీపీ ఎంపీ లు 17 మంది బీజేపీ లోకి మారే అవకాశం. మరో వైపు వైసీపీ ఎం ఎల్ ఏ లు 75మంది పైన,వైసీపీ లోని ఒక కాపు సీనియర్ నాయకుడి నాయకత్వంలో, వైసీపీవైపు చూస్తున్నారు. అయితే ఈ 75 మంది బీజేపీ వైపు వచ్చి ప్రత్యేక గ్రూప్ గా ఏర్పడినా, ప్రతిపక్ష హోదాతప్ప, ప్రభుత్వ ఏర్పాటు కష్టం.

 

ప్రభుత్వం ఏర్పడాలంటే, టీడీపి మద్దతు తప్పనిసరి. కానీ చంద్రబాబుగారు కండిషల్ మద్దతు ఇస్తారని, ఆన్కండిషల్ మద్దతు ఇవ్వరని తెలుసు. చంద్రబాబు పెట్టె కండిషన్స్ కూడా బీజేపీ కి తెలుసు. ఏపీ విభజన బిల్లులోని అన్ని షరతులు ఒప్పుకుని, పూర్తి చేస్తే తప్ప (ప్రత్యేకహోదాతో సహా) టీడీపీ షరతులు లేని మద్దతు ఇవ్వదు అని తెలుసు. ఈ షరతులు ఒప్పుకుంటే, పూర్తి ఛేస్తే, చంద్రబాబుతిరుగులేని నాయకుడవుతాడాని,  ఆ తర్వాత బీజేపీ పెరుగుదల ఏపీలో  అంత తేలిక కాదని ఒక వాదన.

 

మరి - కిం కర్తవ్యం, క్యా కర్నా, ఏమి చేయాలి...


మరో పోస్టులో..

మరింత సమాచారం తెలుసుకోండి: