రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి హత్య ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మధ్యాహ్న సమయంలో సురేష్ అనే వ్యక్తి తహసిల్దార్ విజయారెడ్డి కార్యాలయంలోకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తో తహసిల్దార్ విజయరెడ్డిని సజీవదహనం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రెవిన్యూ శాఖ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతేకాదు విజయా రెడ్డి హత్యతో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ ఉద్యోగులు అలెర్ట్ అయ్యారు . అంతేకాకుండా తహసిల్దార్ విజయ రెడ్డి హత్య తర్వాత మరికొన్ని చోట్ల కూడా కొంతమంది వ్యక్తులు పెట్రోల్ బాటిల్ తో ప్రభుత్వ అధికారులను బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో రెవెన్యూ అధికారులు అందరూ బెంబేలెత్తిపోతున్నారు.
తమ దగ్గరికి వచ్చే ప్రజలు ఎవరు ఎప్పుడు ఇలా ప్రవర్తిస్తారో... ఎలా దాడి చేస్తారో అని భయంతోనే ఉద్యోగాలు చేస్తున్నారు .. అయితే తహసిల్దార్ విజయ రెడ్డి హత్యను ప్రేరణగా తీసుకొని ఎంతో మంది ప్రజలు తమ పనులు జరిపేందుకు లంచం అడిగితే చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. అయితే తహసిల్దార్ విజయ రెడ్డి హత్య ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాకిన విషయం తెలిసిందే. ఏపీలో కూడా కొంత మంది ప్రజలు రెవెన్యూ అధికారులను బెదిరింపులకు గురి చేశారు. అంతేకాకుండా కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు అందరూ లంచం అడిగేందుకు భయపడుతున్నారు. తమను తాము రక్షించుకునేందుకు ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు.
మరో ప్రభుత్వ అధికారి ఇలాంటి ఆలోచనే చేసాడు... ఎక్కడ ప్రజలు తన మీద దాడి చేస్తారో అని భావించి నేను లంచం తీసుకొను అని పెద్ద అక్షరాలతో తన ఆఫీసులో బోర్డు పట్టించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీస్ లో ఎఈడిగా పనిచేసే తోడేటి అశోక్ అనే వ్యక్తి తన కార్యాలయంలో నేను లంచం తీసుకొను అని ఓ పెద్ద బోర్డును రాయించి పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అందరూ లంచాలకు అలవాటు పడకుండా నిజాయితీగా పనిచేస్తే అవినీతిరహిత వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని తెలిపారు ఆయన. ప్రస్తుతం ఈ బోర్డు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. తహసిల్దార్ విజయ రెడ్డి హత్య ఎఫెక్టుతో ప్రభుత్వ అధికారులు అందరూ లంచం తీసుకోకుండా నిజాయితీగా పని చేసేందుకు ముందుకు వస్తున్నారు అని నెటిజన్లు అనుకుంటున్నారు.