
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఆధ్యాత్మిక స్వర్గధామం. ఒక్కసారి అక్కడికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమవుతుంది భక్తులు నమ్ముతుంటారు. ఇక అక్కడికి చేరుకున్న భక్తులు తోజోమానంగా విరాజిల్లుతున్న శ్రీవారిని దర్శించుకుని పునీతులలవుతుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల తిరుపతి దేవస్థానం అలలారుతు ఉంటుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య ప్రసాదం లడ్డూ ప్రసాదం భక్తులకు పుణ్య ప్రసాదం. తిరుమల తిరుపతి దేవస్థానములు లడ్డు ప్రసాదం వల్ల స్వామివారి కటాక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం లో లడ్డూ ప్రసాదానికి విశిష్టత ప్రాముఖ్యత ఉంటుంది. లడ్డూ ప్రసాదాన్ని తిరుమలకు వెళ్లిన భక్తులు తాము తినడమే కాకుండా పదిమందికి పంచడం ద్వారా కూడా కాస్తయినా పుణ్యం లభిస్తుందని భావిస్తూ ఉంటారు.
అంతేకాక జగన్ సర్కార్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ధరను పెంచిన విషయం తెలిసిందే. అయితే శ్రీవారి లడ్డూ ధరను పెంచడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు గాను చంద్రబాబుపై ప్రస్తుతం కేసు నమోదైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మధ్యం ధరలను పెంచినట్లు గానే తిరుమల లడ్డూ ప్రసాదం ధరలను కూడా పెంచుతున్నారని... లడ్డు ధరలను పెంచి పేద ప్రజలకు లడ్డు ప్రసాదాన్ని దూరం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మద్యం నిషేధం చేస్తామంటూ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే తిరుమలకు భక్తులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే లడ్డు ధరలను కూడా పెంచుతున్నారు అంటూ టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను తప్పు పడుతూ ప్రస్తుతం తిరుపతి పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు పై కేసు నమోదయింది.
ఇక తిరుమలకు దర్శనానికి వెళ్తున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం లేదంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన మంత్రి కొడాలి నాని రాజకీయ ఆరోపణలకు తిరుమల తిరుపతి వెంకన్నను టార్గెట్ చేయడం ఏంటని విమర్శలు గుప్పించారు. అయితే గత కొంతకాలంగా టిడిపి వైసిపి మధ్యలో ఉన్న మాటలు యుద్ధంలో ఇప్పుడు బీజేపీ సైతం వచ్చి చేరడంతో ఆంధ్ర రాజకీయాల్లో మరింత హాట్ హాట్ గా మారింది. అయితే తిరుమలపై మంత్రి వ్యాఖ్యలకు సీఎం సమాధానం చెప్పాల్సిందేనని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మొత్తం మీద ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తిరుమల వారి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాలి.