
ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న సమయంలో ఆర్టీసీలోని 5, 100 ప్రైవేటీకరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ జేఏసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని పై నేడు హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాగా ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదిస్తున్న ఏజీ ఆర్టీసీ ప్రైవేటీకరణ పై పలు వాదనలు వినిపించారు. ఆర్టీసీ రూట్లో ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంటుందని అడిషనల్ జనరల్ తెలిపారు. ప్రభుత్వ పాలసీలలో పిటిషనర్ల జోక్యం చేసుకోవడానికి వీలులేదు అంటూ ఏజీ సూచించారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఆర్టీసీ సంస్థ పై పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని ఇందులో పిటిషన్ దారుడు జోక్యం చేసుకోవడానికి వీలు ఉండదు అంటూ అడిషనల్ జెనరల్ వాదించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే తాము ముందుకు వెళ్తున్నాము అంటూ ఆయన తెలిపారు. ఆర్టీసీ సంస్థ ప్రైవేటీకరణకు పూర్తి అధికారాలు ఉండేలా సుప్రీంకోర్టు సెక్షన్ 67 లో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు పొందుపరిచింది అంటూ ఆడిటర్ జనరల్ వాదించారు. అంతేకాకుండా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం తీసుకునే నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు వీలు లేదు అంటూ ఆలోచనలు జనరల్ వాదించారు.
అయితే ఆర్టీసీ సంస్థ ప్రైవేటీకరణ అంశంపై ఇంకా హైకోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి . ఆర్టీసీ ప్రైవేటీకరణ పై వాదనలు ప్రతి వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా అటు ఆర్టీసీ కార్మికులు 47 రోజుల తర్వాత సమ్మె విరమిస్తున్నామని ఆర్టీసీ కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగాల్లో చేర్చుకోవాలని తెలిపిన విషయం తెలిసిందే. అయితే సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు డిపో వద్దకు చేరుకోగా డిపో మేనేజర్ లు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆదేశాలు వచ్చిన తర్వాత విధుల్లోకి తీసుకుంటామంటూ ఆర్టీసీ కార్మికులకు చెప్పిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన వారిని ఇప్పటివరకు విధుల్లో చేర్చుకునేందుకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆర్టీసీ జేఏసీ దీనిపై స్పందించింది .
తాము ఆర్టీసీ కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని సమ్మె విరమణ ప్రకటన చేసినప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు ఆర్టీసీ అశ్వద్ధామ రెడ్డి. సమ్మె విరమించినప్పటికి కూడా ప్రభుత్వం కార్మికులపై మొండి పట్టు వీడటం లేదంటూ ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకుంటే రేపు ఆర్టీసీ డిపోల నుంచి సేవ్ ఆర్టీసీ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఆర్టీసి జెఎసి కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా రేపటి నుంచి తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఆర్టీసీ సమ్మె ఉద్ధృతం చేస్తాం అంటూ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. కానీ ఇటు కేసిఆర్ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దీనికి సంబంధించిన వాదనలను హైకోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయవాది వినిపిస్తున్నారు. కాగా దీనిపై హై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది... ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అన్నది మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.