దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతోందన్న విషయం తెలిసిందే . చాలామంది విద్యావంతులు  ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు చేయడం కంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఈ కాలంలో. ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించేందుకు ఎన్నేళ్లయినా వేచి చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల  కోసం ఏళ్ల తరబడి మరీ  ఉద్యోగాల నోటిఫికేషన్ లా  కోసం నిరీక్షిస్తూ వుంటారు. ఇక ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు విడుదలైనా దానికి దరఖాస్తులు చేసుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. నోటిఫికేషన్ విడుదలైన ఉద్యోగాల సంఖ్య కంటే దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు దారుల సంఖ్య  పెరిగిపోతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే లైఫ్ సెట్ అయిపోతుంది అని నమ్ముతారు. అయితే పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా చిన్న చిన్న స్వీపర్ ఉద్యోగాలకు  కూడా అప్లై చేసుకుంటారు. దీంతో 10వ తరగతి చదివినవారికి విడుదలైన నోటిఫికేషన్లు కూడా పెద్ద పెద్ద చదువులు చదివి దరఖాస్తు చేసుకోవడంతో ఆ జాబులు  కూడా వారికే వెళ్ళిపోతున్నాయి . 

 


 అయితే తాజాగా బీహార్ రాష్ట్రంలో ఇటీవలే 166 గ్రూప్-డి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. 166 ఉద్యోగాల కోసం ఏకంగా ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఐదు లక్షల మందిలో ఎక్కువగా పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఎక్కువగా ఉండటం గమనార్హం. గ్రూప్-డి పోస్టులకు కూడా ఎక్కువ మొత్తంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు  దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. ఏకంగా 166 పోస్టులకు ఐదు లక్షల మంది దరఖాస్తులు చేసుకోవడంపై ప్రతిపక్షాలన్ని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి . రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగి పోవడం వల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు కూడా గ్రూప్-డి పోస్టుల దక్కించుకోవడానికి ఎగబడుతున్నారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో నిరుద్యోగం  పెరిగిపోయింది  అంటూ ఆరోపిస్తున్నాయి. 

 

 

 ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలు పై స్పందించిన మంత్రి శ్రావణ్ కుమార్... ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. అభ్యర్థులు ఎంత  పెద్ద చదువులు చదివినప్పటికీ  ఉద్యోగాలకు  తమ  ఇష్ట ప్రకారమే దరఖాస్తులు చేసుకున్నారని... పలానా ఉద్యోగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటూ  దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు  ప్రభుత్వం  ఏమీ చెప్పట్లేదు కదా అంటూ ప్రతిపక్షాలను  ప్రశ్నించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో పోటీ పరీక్షలలో విజయం సాధించిన వారిలో ప్రతిభావంతులను  ఎంపిక చేయడం వరకే ప్రభుత్వం యొక్క పాత్ర అంటూ ఆయన చెప్పారు. అయితే నిరుద్యోగం అనేది కేవలం బీహార్ రాష్ట్రంలోనే  ప్రపంచవ్యాప్తంగా ఉందని తెలిపారు. కాగా ప్రస్తుత కాలంలో ఉద్యోగాల కోసం ఎక్కడైనా పోటీ పెరిగిపోయిందని మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: