మహారాష్ట్రలో ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి. మహారాష్ట్ర లోని అన్ని పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. ప్రజలను ఆకర్షించేందుకు పార్టీల నేతలు ప్రయత్నాలు చేశాయి. ఎన్నో హామీలు కూడా కురిపించాయి. ఇక అన్ని పార్టీలు గెలుపుపై ధీమా తో కూడా ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. కానీ ఏ పార్టీకి సరైన మెజార్టీ మాత్రం రాలేదు. 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 అసెంబ్లీ స్థానాల్లో గెలవవలసి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని ఏ పార్టీకి  కూడా 145 స్థానాలను కట్టపెట్టలేదు మహారాష్ట్ర ప్రజానీకం . మహారాష్ట్ర లో బీజేపీ  భారీ మెజారిటీ స్థానాలు గెల్చుకున్నప్పటికీ  ... మ్యాజిక్ ఫిగర్ చేరువలోకి మాత్రం వెళ్ళేలేక  లేకపోయింది. 

 

 

బిజెపి మొత్తంగా 105 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా... ఆ తర్వాత మహారాష్ట్ర లో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన పార్టీ 56 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 
 అటు ఎన్సీపీ  పార్టీ 54 కాంగ్రెస్ పార్టీ 44 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ప్రజల తీర్పు తో మహారాష్ట్ర లోని అన్ని పార్టీలు షాక్ కి గురయ్యారు. ఇక ఇంకేముంది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వేరే పార్టీ మద్దతు తప్పనిసరి అయింది. ప్రజలు ఏ పార్టీకి సరైన మెజారిటీని కట్టకపోవడంతో ప్రజల తీర్పు ముందు అన్ని పార్టీలు వేరే పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు విలవిలలాడుతున్నాయి. బిజెపికి మహా  ప్రజలందరూ ఎక్కువ స్థానాలు కట్టబెట్టిన...  ఆ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ కు తగ్గ స్థానాల్లో  మాత్రం  గెలిపించ లేదు.

 


 మహారాష్ట్ర ప్రజానీకం ఇచ్చిన తీర్పు అన్ని పార్టీలకు చాలా కష్టాలను తెచ్చి పెట్టింది. మొదట్లో బిజెపి శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ... శివసేన నాయకుడికి సీఎం పదవి కట్టబెట్టాలని శివసేన డిమాండ్ చేయడంతో...శివసేన బీజేపీ కూటమి చీలిపోయింది.  దీంతో  పార్టీలకు  తంటాలు మొదలయ్యాయి. వేరే పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడం లేదా వేరే పార్టీల మద్దతు కూడగట్టే అంశంపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. ఈ నేపథ్యంలోనే శివసేన పార్టీ ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధమవుతున్న వేల...  బీజేపీ సరికొత్త వ్యూహంతో  తెర మీద వచ్చి  చివరికి దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ పార్టీలు విలవిల్లాడుతున్నాయి. ఎందుకంటే బలనిరూపణ చేసుకోవడానికి బిజెపి పార్టీ మిగతా పార్టీల ఎమ్మెల్యేల మద్దతు కోసం విలవిలలాడుతుంటే... బిజెపి ప్రలోభాల నుండి తమ పార్టీ ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు మిగతా పార్టీలు తంటాలు పడుతున్నాయి . మొత్తానికి ప్రజల తీర్పు పై మహా పార్టీలన్నీ తంటాలు పడుతూ విలవిలలాడాల్సిన  పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: