నేడు భారత రాజ్యాంగ 70 దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని మోదీ,రాట్రపతి రామ్ నాథ్ కోవింద్,  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. కాగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయసభల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యాంగ గొప్పతనాన్ని గురించి వివరించారు. ముందుగా ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికీ ముందుగా  నివాళులర్పించారు ప్రధాని మోదీ. రాజ్యాంగ దినోత్సవం రోజున ఎంతో సంతోషంగా ఉండటంతో  అంతే బాధ ఉందంటూ ప్రధాని మోడీ అన్నారు. నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపారని  అదే రోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భరత్ ను సరైన మార్గంలో నడిపిస్తుందని   ఆయన అన్నారు. 

 

 

 

 భారత రాజ్యాంగాన్ని భారతీయులంతా పవిత్ర గ్రందంగా  భావిస్తారు అని... అందుకే భారత రాజ్యాంగాన్ని అమితంగా గౌరవిస్తారు ప్రాధాన్యం ఇస్తారు అని ప్రధాని మోడీ తెలిపారు . భారత రాజ్యాంగం వల్లే దేశంలో శాంతి సామరస్యం పెంపొందుతుందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం వల్లే  అందరం కలిసే ఉన్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అయితే 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం రాలేదని అంతకు ముందు ఎన్నో గణతంత్రాలు  కూడా భారతదేశం జరుగుతుందని అన్నారు. రోజురోజుకు ప్రపంచంలో భారత ప్రతిష్ఠ పెరుగుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 

 

 

 

 భారత రాజ్యాంగాన్ని దేశ ప్రతిష్ఠను కాపాడేందుకు భారత ప్రజలు ఉమ్మడిగా నిలిచారని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యాంగం  ప్రమాదంలో పడినప్పుడు  దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై  ఉంది ప్రధాని మోదీ పిలుపునిచ్చారు . రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు  ఈ సందర్భంగా నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. భారత రాజ్యాంగం వల్లే దేశ ప్రజలందరూ శాంతి సామరస్యం తో కలిసి ఉన్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశంలోని యువత సేవాభావాన్ని పెంపొందించుకోవాలి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యాంగ గొప్పతనాన్ని గురించి ప్రతిష్టను గురించి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: