
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్షాల విమర్శలు చేసినప్పుడు వారికి గట్టి కౌంటర్ ఇస్తుంది ఎమ్మెల్యే రోజా. పల్లెత్తు మాట అనకుండా వారిపై ఘాటుగానే స్పందించింది. అలాంటిది పవన్ కళ్యాణ్ పై మాత్రం ఒక్క సారి కూడా స్పందించలేదు.. విమర్శలు చేయలేదు రోజా. పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శలు చేసినప్పటికీ రోజు మాత్రం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయలేదు. అటు నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శించిన ప్రతి ఒక్కరికి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఘాటుగా విమర్శలు చేశారు కానీ రోజా పై ఒక విమర్శ కూడా చేయలేదు. వీరిద్దరు జబర్దస్త్లో కొనసాగడం వల్ల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదని వార్తలు కూడా వచ్చాయి.
అయితే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి విషయం తెరమీదకు తెస్తు పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని విషయాల్లో జనసేనాని ప్రజల తరఫున ఫైట్ చేస్తూ జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నప్పటికీ మొన్నటివరకు సైలెంట్గా ఉన్న రోజా తాజాగా పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసింది. తాజాగా మీడియాతో మాట్లాడిన నగరి ఎమ్మెల్యే రోజా... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. జగన్మోహన్రెడ్డి ఆరు నెలల పాలన చూసి ప్రజలు సైరా నరసింహారెడ్డి అంటున్నారని కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిన్న మెదడు చితికి పోయిందేమో ఇష్టం వచ్చిన విమర్శలు చేస్తున్నట్లు రోజా విమర్శలు గుప్పించింది. ఇంగ్లీష్ మీడియం విషయంలో వివాదాలు సృష్టించిన మతమార్పిడులు చేస్తున్నారంటూ చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అయితే రోజు చేసిన విమర్శలపై జనసేనాని ఎలా స్పందిస్తారో అన్న విషయం పక్కన పెడితే... ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న నగరి ఎమ్మెల్యే రోజా అకస్మాత్తుగా పవన్ పై విమర్శలు చేయడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త చర్చకు కూడా మొదలైంది. మొన్నటి వరకు జబర్దస్త్ లో మెగా బ్రదర్ నాగబాబు కొనసాగి గత కొన్ని జబర్దస్త్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకోవడంతో రోజా పవన్ పై విమర్శలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకోవడంతోనే రోజా పవన్ కళ్యాణ్ పై విమర్శలు స్టార్ట్ చేసిందా అనే వార్తలు కూడా తెర మీదికి వస్తుంది.