టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ బాధితులను పరామర్శించడం తో పాటు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులను తెలుసుకునేందుకు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. అయితే ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తకు  పాదాభివందనం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు టిడిపి కార్యకర్తలపై చేస్తున్న దాడులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే చంద్రబాబు సమావేశంలో భాగంగా నర్సయ్య అనే రైతు వైసిపి నాయకులు తనను  తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శారీరకంగా మానసికంగా ఎంతో హింసిస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు వృద్ధ రైతు. టీడీపీని వదిలి వైసీపీ పార్టీలో చేరాలి  అంటూ ఎన్నో సార్లు కొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బకావంతగా వైసీపీలో చేరాలని అంటున్నారని ఈ సమావేశంలో ఆ వృద్ధ రైతు నర్సయ్య తెలిపారు. 

 

 దీంతో వృద్ధ రైతు నర్సయ్య  ఆవేదనను చూసిన చంద్రబాబుకు చలించిపోయారు. వృద్ధ వయసులో ఈ పెద్దాయన ఏడ్చే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. వృద్ధుడు  అని కూడా చూడకుండా ఆయనను చిత్రహింసలకు గురి చేసే కొట్టినందుకు దారుణమంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇంత వయసులో కూడా వైసీపీ నేతలు చిత్రహింసలు పెడుతున్న  పార్టీ కోసం నిలబడిన ఈ రైతు కు పాదాభివందనం చేయాలంటూ వేదికపైనే రైతు దగ్గరికి పిలిచి మరి ఆయన కాళ్లు పట్టుకున్నారు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. 

 


 ఆరు నెలల్లో  ఆదర్శ ముఖ్యమంత్రిగా మారాను అని అనడం దానికి నిదర్శనం ఇదేనా  అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆందోళన చెందొద్దని సూచించారు. వైసిపి పార్టీ ఎన్ని సమస్యలు సృష్టించిన ఎదుర్కొని  పార్టీకోసం నిలబడాలని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో  సుపరిపాలన అందిస్తున్నామని జగన్ సర్కార్ చేప్పుకుంటున్నదని ... సుపరిపాలన అంటే ఇదేనా అంటూ జగన్ సర్కారు ను  నిలదీశారు.ఆదర్శ  ముఖ్యమంత్రి అంటే ఇలా వృద్ధుడు  అని కూడా చూడకుండా తమ పార్టీలో చేరాలి  అంటూ హింసించడమా  అంటూ ప్రశ్నించారు. వీటిపై సమాధానం చెప్పాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: