వైసీపీ పార్టీ ఎంపీ నందిగం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలు సీఎం జగన్ మీద నమ్మకంతో 151 సీట్లు ఇచ్చి గెలిపించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజధానిని సర్వ నాశనం చేశారని, రాజధాని భూములు దోచుకుతిన్నారని, రాజధానిలో కబ్జాలు చేశారని  నచ్చిన విధంగా రాజధానిని వాడుకున్నారని అన్నారు. భూములు ఇచ్చిన రైతుల ఫ్లాట్లు మాత్రం డెవలప్ చేయలేదని నందిగం సురేశ్ అన్నారు. 
 
కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్లాట్లు ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పారని అన్నారు. నరేంద్ర మోదీ గారు శంఖుస్థాపన చేసిన ఏరియాలో కొంతమంది కొన్ని లక్షల ఇటుకలు ఇచ్చారని ఇప్పుడు వెళ్లి చూస్తే ఆ ఇటుకలు అక్కడ లేవని నందిగం సురేశ్ అన్నారు. చంద్రబాబు నాయుడు భూములే కాదు చందాలతో ఇచ్చిన ఇటుకలు కూడా మాయం చేశారని నందిగం సురేశ్ అన్నారు. 
 
చిన్నపిల్లల దగ్గరనుండి కూడా టీడీపీ హయాంలో చందాలు వసూలు చేశారని ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియటం లేదని నందిగం సురేశ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ 9,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం వెచ్చించామని చెబుతున్నారని 9,000 కోట్ల రూపాయలకు లెక్క చెప్పమంటే తెలుగుదేశం పార్టీ నేతలెవరూ లెక్క చెప్పటం లేదని నందిగం సురేశ్ అన్నారు. తాత్కాలిక సచివాలయం, హైకోర్టు ఈ రెండు బిల్డింగులు మాత్రమే టీడీపీ హయాంలో కట్టారని నందిగం సురేశ్ అన్నారు. 
 
రాజధానిలో పర్యటన చేయటానికి చంద్రబాబు పూర్తిగా అనర్హులు అని నందిగం సురేశ్ అన్నారు. గత 5 సంవత్సరాలుగా రాజధానిని పూర్తిగా సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని నందిగం సురేశ్ అన్నారు. చంద్రబాబు నాయుడు హుందాగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సపోర్ట్ చేయాలని నందిగం సురేశ్ కోరారు. రాజధాని కుంభకోణాలమయం అనే విధంగా బాబు చేశారని నందిగం సురేశ్ అన్నారు. ఆ కుంభకోణాల నుండి రాజధానిని ఎలా బాగు చేయాలో సీఎం జగన్ కు తెలుసని నందిగం సురేశ్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: