ఐటీ శాఖ నయీం ఆస్తుల వివరాలను సేకరించే పనిలో పడింది. ఐటీ అధికారులు నయీం ఆస్తుల వివరాలు ఇవ్వాలని పోలీసులను కోరారు. ఐటీ అధికారులు నయీం భార్య హసీనా బేగంను కూడా ఆస్తుల వివరాల గురించి విచారించారు. నయీం భార్య హసీనా ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను చెప్పింది. టైలరింగ్ ద్వారా ఆస్తులను సంపాదించానని నయీం భార్య హసీనా బేగం ఐటీ అధికారులకు చెప్పింది. 
 
పోలీసులు నయీం భార్య ఇచ్చిన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసుకున్నారు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడిన నయీం పోలీసుల ఎన్ కౌంటర్ లో 2016 సంవత్సరంలో చనిపోయారు. నయీం చనిపోయిన తరువాత పోలీసులు నయీం అనుచరులను అరెస్ట్ చేశారు. నయీం ఎన్ కౌంటర్ తరువాత నయీం బినామీ ఆస్తుల వ్యవహారం వెలుగులోకి రావటంతో గతంలోనే ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందని సమాచారం. 
 
నయీం భార్య చెప్పిన సమాధానాలతో ఐటీ అధికారులు షాక్ అయ్యారని సమాచారం. ఐటీ శాఖ నయీం ఆస్తుల గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి ఐటీ శాఖ అధికారులు నయీం భార్యతో పాటు నయీం కుటుంబసభ్యులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో నయీం భార్య హసీనా, నయీం అనుచరులు నాజర్, పాశం శ్రీనులపై పీడీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 
 
కొన్ని రోజుల తరువాత హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. పీడీ చట్టం కేసులను సవాల్ చేస్తూ హసీనా, నాజర్, పాశం శ్రీను హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టులో వారికి ఊరట లభించింది. నయీం ఎన్ కౌంటర్ లో చనిపోయిన సమయంలో నయీం అనుచరులు అక్రమంగా భూములను కబ్జా, రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సంవత్సరం జూన్ నెలలో భూ కబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్ కేసులు నమోదు కావటంతో పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసులను నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: