ఒకే ఒక రాంగ్ స్టెప్ వేసి రాజకీయ జీవితం గందరగోళ పరిస్థితుల్లో పడేసుకున్న నేతల్లో కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకా, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్ రెడ్డిలు ముందువరుసలో ఉంటారు. ముందు నుంచి వీరు జగన్ వెంటే నడిచి ఉంటే రాజకీయ భవిష్యత్తు చాలా బాగుండేది.  కానీ అధికారం కోసం చూసుకుని చంద్రబాబు చెంతకు వెళ్ళి రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు. చివరికి సొంతగూటికి చేరుకున్న ఉపయోగం లేకుండా పోయింది.

 

2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున బుట్టా రేణుకా కర్నూలు ఎంపీగా గెలిస్తే, ఎస్‌వి మోహన్ రెడ్డి కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అప్పుడు వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో వీరి మైండ్ మారిపోయింది. అటు నుంచి బాబు ఆకర్షించడంతో జగన్ ని వదిలేసి టీడీపీలోకి వెళ్ళిపోయారు. అయితే అధికారంలో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్న వీరికి 2019 ఎన్నికల సమయం వచ్చేసరికి చంద్రబాబు పెద్ద షాక్ ఇచ్చారు. ఇద్దరికి మళ్ళీ సీటు ఇవ్వలేదు. దీంతో మళ్ళీ జగన్ ని ఒప్పించి వైసీపీలో చేరారు.

 

అయితే అక్కడ కూడా వీరికి సీటు దక్కలేదు. దీంతో వారు ఆయా స్థానాల్లో వైసీపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేశారు. ఇక వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. ఒకవేళ వీరు ముందునుంచి వైసీపీలో కొనసాగితే వారు సీట్లు వారికి దక్కేవి. ఎమ్మెల్యే, ఎంపీ అయ్యవాళ్లు. కానీ టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ వైసీపీలోకి రావడంతో ఏం పదవి లేకుండా ఉండిపోయారు.

 

ఇక భవిష్యత్తులో వైసీపీలో కూడా ఏదైనా పదవి వచ్చే అవకాశం కూడా కనబడటం లేదు. అలాగే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా వీరికి సీటు దక్కుతుందా? అంటే కూడా చెప్పలేం. ఈ విధంగా ఒకే ఒక తప్పుతో రాజకీయంలో జీరోలుగా మిగిలిపోయారు. ఒకవేళ ముందు నుంచి జగన్ పక్కనే ఉండుంటే హీరోలు అయ్యేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: