మనదేశంలో ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ముందుగా చూస్తోంది..అబ్బాయి ఏం చేస్తున్నాడు.. ఏ ఉద్యోగం.. అమెరికాలో ఉంటే ఇంకా బెటర్.. ఎన్నారై సంబంధమైతే బాగా సంపాదిస్తాడు.. అమ్మాయిని సుఖ పెడతాడు.. ఇదీ ఆడపిల్ల తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి. కానీ ఇకపై ఎన్నారై సంబంధాలు చూసే వాళ్లు కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే బెటర్

 

ఎందుకంటే.. ఇటీవల ఈ ఎన్నారై మొగుళ్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. వీరిపై కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం..2015 నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు ఆరువేలకు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది అక్టోబరు చివరి నాటికి 991 ఫిర్యాదులు వచ్చాయి. 2018లో 1,299కేసులు నమోదైయ్యాయి. 2017లో 1,498 ఫిర్యాదులు, 2016లో 1,510, 2015లో 796 ఫిర్యాదులు అందాయి.

 

గత మూడేళ్ల కాలంలో 77మంది భారతీయులు వివిధ దేశాల్లో చిక్కుకున్నారు. వీరిలో 73 మంది భారత్‌కు తిరిగి రాగా, ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు ఇప్పటికీ చెరలోనే ఉన్నారు. వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉపాధి, వలస నిమిత్తం కువైట్‌, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, ఖతార్‌, ఒమన్‌, యూఏఈ వెళ్లిన భారతీయుల్లో 2019 అక్టోబరు నాటికి 4,823 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

2018లో ఈ సంఖ్య 6,014గా ఉంది. 2017లో 5,906, 2016లో 6,013 మంది, 2015లో 5,786 మంది మృతి చెందారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో తెలిపారు . విదేశాల్లో ఎన్నారైలపై నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా వరకట్నం , గృహహింస, వేధింపులు వంటి కేసులే ఉంటున్నాయట. విదేశాల్లో ఉన్న భారతీయ మహిళలకు భద్రత కల్పించే విధంగా అప్పటి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చట్టం ప్రకారమే కేసులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: