మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనలో రైతులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు కాన్వాయ్ పైకి ఒక వర్గం రైతులు చెప్పులు, కర్రలు విసరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబుకు కొందరు స్వాగత నినాదాలు చేస్తుంటే కొందరు మాత్రం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించటానికి అమరావతి పర్యటన చేస్తున్నారు. 
 
చంద్రబాబు పర్యటనలో రైతులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు రైతులు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తుంటే మరికొందరు రైతులు మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులకు దిగారు. ఇరువర్గాలు కొంత సమయం పాటు దాడులు చేసుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. 
 
ఆ తరువాత చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదలగా కూల్చివేసిన ప్రజావేదికను చంద్రబాబు పరిశీలించారు. ప్రధాని నరేంద్రమోదీ శంఖుస్థాపన చేసిన ఉద్దండరాయపాలెంలోని ప్రాంతాన్ని ఈరోజు చంద్రబాబు సందర్శించనున్నారు. చంద్రబాబు గృహ సముదాయాల నిర్మాణాలను కూడా ఈరోజు పరిశీలించనున్నారు. రైతులు చంద్రబాబు పర్యటనకు నిరసనగా నల్ల జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. 
 
రైతులు రాజధాని పేరుతో భూములు దోచుకున్న చంద్రబాబు రాజధానిలో పర్యటించవద్దంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మా ఫ్లాట్లు ఎక్కడున్నాయో చూపించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశారని రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించవద్దంటూ రైతులు ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా రైతులు నిరసన తెలుపుతుంటే కొందరు టీడీపీ నేతలు రైతులపై దాడులకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్న రైతులపై దాడులకు దిగారు. పోలీసుల రంగప్రవేశం తరువాత పోలీసులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తోపులాట చోటుచేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: