రాజధానిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేసిన ఓవ‌ర్ యాక్ష‌న్ మ‌రోసారి ప్లాప్ అయ్యింది. రాజ‌ధాని విష‌యంలో ముందు నుంచి సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొద్ది రోజులుగా రాజ‌ధాని అంశాన్ని ఆస‌రాగా చేసుకుని త‌న‌ను ఇరుకున పెట్టేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జ‌గ‌న్ వేసిన ఎత్తు, పాచిక బాగానే పారిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు రాజ‌ధాని పేరుతో చేసిన హ‌డావిడే క‌నిపిస్తోందే త‌ప్పా... ఎక్క‌డా రాజ‌ధాని అన్న‌ది లేదు. 

 

ఈ టైంలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన మూడో నెల నుంచే రాజ‌ధాని అక్క‌డ నుంచి త‌ర‌లిపోతుందంటూ చంద్ర‌బాబు & బ్యాచ్ చేస్తోన్న హ‌డావిడి మామూలుగా లేదు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు రాజ‌ధాని కేంద్రంగా బాబు మ‌రో స‌రికొత్త అంకానికి తెర‌దీశారు. బాబు రాజ‌ధాని ప‌ర్య‌ట‌న ఖ‌రార‌వుతుంద‌నుకున్న టైంలో జ‌గ‌న్ రాజ‌ధాని ప‌నులు కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. అయినా కూడా బాబు మొండిగా ఈ రోజు ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేర‌డంతో అక్క‌డ రైతులు, ప్ర‌జ‌ల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. రైతులే బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటున్నారు. 

 

బాబు ప‌ర్య‌ట‌న‌ నిరసిస్తూ రాజధాని ప్రాంతం రైతులు గురువారం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజధాని పేరుతో భూములు తీసుకుని చంద్రబాబు తమకు అన్యాయం చేశారని, ఈ అన్యాయాన్ని నిలదీయడానికి వస్తే.. చంద్రబాబు విజయవాడ గుంటూరు నుంచి తీసుకువచ్చి రౌడీలను తీసుకొచ్చి తమపై దాడి చేయించారని రైతులు మండిపడ్డారు. ఏదేమైనా జ‌గ‌న్ నిర్ణ‌యం ప‌ట్ల మెజార్టీ రైతుల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంద‌న్న‌ది మాత్రం నిజం. బాబు రాజ‌ధాని పేరుతో జ‌గ‌న్‌పై ఆడాల‌నుకున్న డ్రామాకు జ‌గ‌న్ వ్యూహంతో చెక్ పెట్టిన‌ట్ల‌య్యింది. ఏదేమైనా చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలో ఎన్న‌డూ లేనంత ఘోర‌మైన అవ‌మానం ఆయ‌న ఎదుర్కొన్నట్ల‌య్యింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: