మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2,3,4 తేదీలలో కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. కానీ చంద్రబాబు కర్నూలు పర్యటన గురించి తెలిసిన వెంటనే రాయలసీమ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లాకు చంద్రబాబు నాయుడు రావొద్దంటూ టీడీపీ పార్టీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శించారు. 
 
2019 ఎన్నికల్లో కర్నూలులోని 14 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. పార్టీ ఘోర పరాజయంపై సమీక్షలో భాగంగా చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చంద్రబాబు నాయుడును కర్నూలు పర్యటనకు అనుమతించము అని అన్నారు. 
 
రాయలసీమ ప్రాంతం ప్రయోజనాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం పని చేయలేదని విద్యార్థి సంఘాల జేఏసీ చెబుతోంది. హైకోర్టును లేదా రాజధానిని రాయలసీమకు మార్చడానికి చంద్రబాబు అనుకూలంగా ప్రకటన చేస్తే మాత్రమే చంద్రబాబు కర్నూలు జిల్లాలో ప్రవేశించాలని విద్యార్థి సంఘాల జేఏసీ చెబుతోంది. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు అమరావతి పర్యటనలో చంద్రబాబుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. 
 
చంద్రబాబు కర్నూలుకు వస్తే మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల పాలనలో రాయలసీమ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మూడు నియోజకవర్గాల్లో మాత్ర.మే విజయం సాధించింది. కడప, కర్నూలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేకపోవడం గమనార్హం. రాయలసీమలో తెలుగుదేశం పార్టీలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేసిన చంద్రబాబు, హిందూపురం నుండి పోటీ చేసిన బాలకృష్ణ, ఉరవకొండ నుండి పోటీ చేసిన పయ్యావుల కేశవ్ మాత్రమే విజయం సాధించారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: