పోలీసులు, మీడియా అత్యాచార ఘటనలు జరిగిన సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యుల అనుమతి ఉంటే మాత్రమే ఆమె వివరాలను వెల్లడించవచ్చు. కుటుంబ సభ్యుల అనుమతి లేకపోతే బాధితురాలు ఎవరు...? వృత్తి ఏమిటి...? ఎక్కడ నివశిస్తారు...? మొదలైన వివరాలను బహిర్గతం చేయకూడదు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం సెక్షన్ 228 ఏ ప్రకారం ఉంది. 
 
మన సమాజం చాలా సందర్భాల్లో లైంగిక దాడి చేసిన మానవ మృగాల కంటే బాధితులను నీచంగా చూస్తోంది. అందువలన బాధితుల వివరాలు ఇతరులకు తెలియకుండా ఉండటం కొరకు మరో పేరుతో పిలిచే సాంప్రదాయం అమలులో ఉంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బాధితురాలి పేరును మార్చటానికి అసలు కారణం ఇదే. బాధితురాలి తల్లిదండ్రుల వివరాలను మరియు కుటుంబ సభ్యుల వివరాలను గోప్యంగా ఉంచాలని సజ్జనార్ కోరారు. 
 
2012 సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నిర్భయ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దుండగులు కదులుతున్న బస్సులో అఘాయిత్యానికి పాల్పడ్డారు. అఘాయిత్యానికి పాల్పడిన తరువాత దుండగులు యువతిని వాహనం నుండి బయటకు నెట్టారు. బాధితురాలు మృత్యువుతో కొన్ని గంటలు పోరాడి మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
సుప్రీం కోర్టు బాధితురాలి వివరాలు మరియు బాధితురాలి తల్లిదండ్రుల , కుటుంబ సభ్యుల వివరాలు ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో నిర్భయ అనే పేరు పెట్టింది. నిర్భయ అంటే భయం లేని, భయపడని అనే అర్థం వస్తుంది. ఆ తరువాత ప్రభుత్వం నిర్భయ చట్టం చేసింది. దిశ అనే పదానికి లక్ష్యం, మార్గం, గురి, దిక్కు అనే అర్థాలు వస్తాయి. దిశ ఘటన చట్టాలను చేయటంతో పాటు ఆ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: