ఇటీవల  చంద్రబాబు నాయుడు బస్సు యాత్రలో చంద్రబాబుపై రాళ్లు, చెప్పులతో దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదా. ఈ ఘటనపై మంత్రి కోడలి నాని స్పందిస్తూ  ఆ దాడి చేసినది చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులే అని తెలియ చేయడం జరిగింది. చంద్రబాబు  మోసం చేశారనే కోపంతో రైతుల దాడి చేస్తే.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడిచేసినట్లు ప్రచారం చేస్తున్నారు అని మంత్రి కోడలి నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైఎస్సార్‌సీపీ నాయకులు దాడులు చేయాలనుకుంటే జిల్లాల పర్యటనలో చేయలేమా అని ప్రశ్నించడం జరిగింది.  మంత్రి కోడలి నాని మాట్లాడుతూ... తమ పార్టీ నేతలకు గానీ, పోలీసులకు గానీ అలాంటి ఆలోచననే లేదు అని తెలిపారు.

 

  చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు అని మంత్రి నాని అన్నారు. ఇక మరోవైపు లోకేష్‌ ట్విటర్‌, యూట్యూబ్‌లకు మాత్రమే పరిమితం అవుతున్నారు అని ఎద్దేవా చేయడం జరిగింది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా మూడు నెలలకోసారి బయటకు వచ్చి ఏదో మాట్లాడుతారు తప్ప ఏమీ చేయడని విమర్శించడం జరిగింది. చంద్రబాబు తా అంటే పవన్‌ తందానా అంటారని ఎద్దేవా చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో నెలకొన్న  వర్షాల వల్లే ఉల్లిపాయల సమస్య రావడం జరిగింది అని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో కంటే మెరుగ్గా రూ.25కే కిలో ఉల్లిని అందిస్తున్నామని మంత్రి  తెలియచేయడం జరిగింది.

 

ఇక  అమిత్‌ షాను పవన్‌ పొడిగాడు అనే విషయానికి వస్తే..జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడం కోసమే అమిత్‌ షాను పవన్‌ కల్యాణ్‌  పొగిడారు అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఇక జనసేన పార్టీని  బీజేపీలో విలీనం చేసేందుకు పవన్‌ కళ్యాణ్ మంచి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు అని నాని తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: