ఎవరు ఎన్ని అనుకున్నా సరే తాను అనుకున్నది తాను చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్. అందుకోసం ఆయన ఎక్కడి వరకు అయినా వెళ్తారు... వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు కొన్ని సమస్యలపై ఆయన స్పందించే తీరు కూడా అలాగే ఉంటుంది. ఆ స్థాయిలో ఆర్టీసి ఉద్యమం జరుగుతుంటే కెసిఆర్ నుంచి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా వాళ్ళను శాంతింప జేసేలా రాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సున్నిత విషయాలను కూడా ఆయన స్వీకరించే తీరే వివాదాస్పదం.

 

దిశ హత్య కేసులో పార్లమెంట్ స్థాయిలో చర్చ జరిగింది. దేశ మొత్తం ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించింది ప్రభుత్వాలను, చట్టాలను విమర్శించింది. రాజకీయంగా కూడా ఇది దుమారం రేపింది... తెలంగాణా గవర్నర్ రాజభవన్ నుంచి నేరుగా... బాధితురాలి ఇంటికి వెళ్లారు. అయినా కెసిఆర్ నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు దీనిపై జాతీయ మీడియా మండిపడుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఎందుకు స్పందించడం లేదని, ఈ ఘటనపై ఆయన స్పందించే తీరిక లేదా...? ఆయన ఒక ముఖ్యమంత్రా...? మంత్రులు బాధితుల మీద విమర్శలు చేస్తారా ? అంటూ జాతీయ మీడియా ఏకరువు పెట్టేస్తుంది.

 

అసలు ఆయన ఒక్క మీడియా సమావేశం కూడా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నిస్తుంది. ఇక అర్నాబ్ గోస్వామి అయితే చర్చా వేదికలు పెట్టి మరీ గత రెండు రోజులుగా కెసిఆర్ మీద విమర్శలు చేస్తున్నారు. హోం మంత్రి మహ్మద్ అలీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఘాటుగా స్పందించారు అర్నాబ్. ఇటీవల తెరాస ఎంపీని లైవ్ లోనే కడిగేశారు. జాతీయ స్థాయిలో మహిళలను పిలిచి మరీ చర్చలు పెట్టి కెసిఆర్ మీద విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నేష‌న‌ల్ మీడియా కేసీఆర్‌, టీఆర్ఎస్‌ను ఇలా టార్గెట్ చేయ‌డం వెన‌క బీజేపీ స్కెచ్ ఉంద‌న్న సందేహాలు కూడా టీఆర్ఎస్ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: