2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ 151 ఎమ్మెల్యే సీట్లతో ఘనవిజయం సాధించగా తెలుగుదేశం పార్టీ 23 సీట్లతో జనసేన పార్టీ ఒకే ఒక సీటుతో సరిపెట్టుకుంది. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుండి పోటీ చేసినా ఎన్నికల్లో మాత్రం విజయం సాధించలేదు. నందమూరి బాలకృష్ణ మాత్రం అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు.
పవన్, బాలకృష్ణ ఇద్దరూ సినిమాల్లో నుండి రాజకీయాల్లోకి వచ్చినవాళ్లే. ఎన్నికల ఫలితాల తరువాత బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల కంటే సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నెల 20వ తేదీన బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా విడుదల కాబోతుంది. బాలకృష్ణ వాస్తవాన్ని గ్రహించి సినిమాలను చేసుకుంటూ పోతూ ఉంటే పవన్ మాత్రం ఇంకా భ్రమల్లోనే జీవిస్తున్నారనే అభిప్రాయాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని గ్రహించిన బాలకృష్ణ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటే పవన్ మాత్రం తెలుగుదేశం పార్టీని వదలటం లేదు. పైకి తెలుగుదేశం పార్టీకి పవన్ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటనలు చేయకపోయినా పవన్ వ్యాఖ్యల్లో పవన్ ఇంకా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారని అర్థం అవుతూనే ఉంది. మరోవైపు గత కొన్ని రోజుల నుండి పవన్ సినిమాల్లో నటిస్తారని ప్రచారం జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ దగ్గర కొందరు నిర్మాతల అడ్వాన్స్ లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. కానీ పవన్ రాజకీయాల్లో కొనసాగుతారా..? లేక సినిమాల్లోకి వస్తారా...? అనే విషయంలో స్పష్టత రావటం లేదు. పాతికేళ్ల ప్రస్థానం అని చెబుతున్న పవన్ ఎన్నికల ఫలితాలు వచ్చి ఆరునెలలైనా జనసేన పార్టీని మాత్రం బలోపేతం చేయటంతో విఫలమయ్యారు. తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్ కే నష్టమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పవన్ ఇప్పటికైన భ్రమల్లో నుండి వాస్తవంలోకి రావాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.