రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల గురించి నిందితుల గ్రామస్థులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. దిశ ఘటన నిందితులలో అరీఫ్ నారాయణపేట జిల్లా జక్లేర్ కు చెందిన వ్యక్తి కాగా నవీన్, శివ, చెన్నకేశవులు గుడిగుండ్లకు చెందినవారు. ఈ రెండు గ్రామాల ప్రజలలో దిశ ఘటన పట్ల అంతులేని ఆవేదన కనిపించటంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ కూడా వినిపించింది. 
 
ఈ రెండు గ్రామాల ప్రజలు నిందితులు చెడు వ్యసనాలకు బానిసలై, చెడు స్నేహాల వలన తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకున్నారని చెబుతున్నారు. గ్రామస్థులు నిందితులు నెలలో నాలుగైదు రోజులు మాత్రమే గ్రామంలో ఉండేవారని జులాయి చేష్టలు చేస్తూ చిల్లర దొంగతనాలు చేస్తూ ఉండేవారని చెప్పారు. మద్యం ఎక్కువగా తాగేవారని ఊళ్లో ఉన్నన్నిరోజులు స్నేహితులతో కలిసి ఎక్కువగా తిరిగేవారని చెప్పారు. 
 
కుర్ర ఛేష్టలు అని అనుకున్నామని ఆ అలవాట్లే, ఆ వ్యసనాలే వారిని నిందితులుగా మార్చాయని గ్రామస్థులు చెప్పారు. నిందితుల కుటుంబ సభ్యులు పేదవారని సమాజంలో మారుతున్న పరిస్థితులపై వారికి అవగాహన లేదని నిందితుల తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై సరైన శ్రద్ధ పెట్టలేకపోయారని చెప్పారు. నిందితులలో ఎవరూ పదో తరగతి కూడా పాస్ కాలేదని చదువుకోకపోవడం వలన క్లీనర్లుగా కెరీర్ మొదలుపెట్టారని చెప్పారు. 
 
నిందితుల తల్లిదండ్రులు కూలి పనులు చేసి జీవనం సాగించేవారని తమ పిల్లలు దారి తప్పుతున్నారని గుర్తించలేకపోయారని గ్రామస్థులు చెప్పారు. నిందితులు గతంలో గ్రామంలోని కొందరు వ్యక్తులతో గొడవలు కూడా పడ్డారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా నిందితులు అఘాయిత్యాలకు పాల్పడ్డారని కానీ ఆ అఘాయిత్యాలు వెలుగులోకి రాలేదని తెలుస్తోంది. ప్రధాన నిందితుడైన అరీఫ్ గతంలో ఒక వ్యక్తి దగ్గర మొబైల్ కొనుగోలు చేసి మొబైల్ అమ్మిన వ్యక్తికి డబ్బులు ఇవ్వకుండా పలు సందర్భాల్లో గొడవ పడ్డాడని సమాచారం. అరీఫ్ తో పాటు మిగతా నిందితులు కొన్ని నెలల పాటు పెట్రోల్ బంక్ లో పని చేశారని తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: