దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ తర్వాత చాలా మంది నేరస్థులు భయం పట్టుకుంది. తాము నేరం చేస్తే ఎక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు అంటూ కాస్త వెనక్కి తగ్గుతున్నారు నేరస్తులు. అయితే తాను చేసిన పనికి ఎక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారో  అని భావించిన వ్యక్తి ఏకంగా ఉరేసుకుని  చనిపోయాడు. ఇంతకీ ఆ  వ్యక్తి ఏం చేశాడు అనుకుంటున్నారా... భార్య పిల్లలను అతి కిరాతకంగా చంపి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు ఈ కర్కోటకుడు. అయితే పోలీసులు ఎక్కడ తనను పట్టుకుని ఎన్కౌంటర్ చేస్తారో  అని భయపడి ముందుగానే ఉరి వేసుకొని చనిపోయాడు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ కర్కోటకుడు చేసిన దాడిలో తన కొడుకు మినహా మిగతా అందరూ మరణించారు. 

 

 

 

 వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నెమలికొండ కు చెందిన లక్ష్మీరాజం అనే వ్యక్తి సిద్దిపేటలోని ఖమ్మం పల్లి కి చెందిన విమల తో పెళ్లి జరిగింది. వీరిద్దరికీ పవిత్ర, జైపాల్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వివాహం జరిగిన కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత భర్త లక్ష్మీరాజం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. రోజు భార్యకు టార్చర్ చూపిస్తూ ఉండేవాడు ఆ భర్త. ప్రతిరోజు వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండేది. ఇక భర్త బాధను భరించలేని భార్య విమల మే నెలలో భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా  పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరూ కోర్టులో హాజరవ్వగా  కోర్టులో వీరిద్దరి మధ్య రాజీ కుదరడంతో సిద్ధిపేటకు వచ్చి కాపురం పెట్టారు ఈ దంపతులు. 

 

 

 

 అయితే మరోసారి గత నెల 21న  భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో భార్య ఇద్దరు పిల్లలను భర్త లక్ష్మీరాజ్యం పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చాడు. మళ్లీ అదే రోజు రాత్రి భార్య పుట్టింటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం నిద్రిస్తున్న భార్య పిల్లలపై టర్బన్టైన్ పోసి నిప్పంటించి  పరారయ్యాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన విమల, సోదరులు జాన్ రాజ్ ఆయన భార్య రాజేశ్వరి, విమల  కుమార్తె పవిత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాంధీ హాస్పిటల్ చికిత్స పొందుతున్న విమల సోదరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే కొడుకు జయపాల్  వేరే గదిలో నిద్రిస్తుండగా దాంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఎక్కడ పోలీసులు అతన్ని పట్టుకుని ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో కొండగట్టు వద్ద చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు లక్ష్మీరాజం.

మరింత సమాచారం తెలుసుకోండి: