జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్ర సెంటిమెంట్ ను రాజకీయ నాయకులు బలంగా నమ్ముతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 ఎన్నికలకు ముందు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి 2004 ఎన్నికల్లో సీఎం అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన సీఎం జగన్ 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘనవిజయం సాధించి సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఇమేజ్ పెంచటానికి మరియు పార్టీని బలోపేతం చేయటానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర చేసి 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. పాదయాత్ర గురించి పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చినప్పటికీ పాదయాత్రకు సంబంధించిన వివరాలను మాత్రం ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ విడతల వారీగా పాదయాత్ర చేస్తారా...? లేక ఒకే విడతలో పాదయాత్ర చేస్తారా..? తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మాట్లాడుతూ గతంలో నేతలు ఓట్ల కొరకు పాదయాత్రలు చేశారని తాను మాత్రం రైతుల కన్నీరు తుడవటానికి పాదయాత్ర చేయబోతున్నానని పవన్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మాటల ద్వారా పవన్ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ పాదయాత్రకు ఇది సరైన సమయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసి సీఎం అవుతారో లేదో చూడాల్సి ఉంది. త్వరలో పవన్ కళ్యాణ్ పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించబోతున్నారని సమాచారం.