కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుడు చాణక్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు చాణక్య దగ్గరనుండి 824 మిల్లీ గ్రాముల 40 ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. చాణక్య డ్రగ్స్ ను జమ్మూ కశ్మీర్ నుండి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో విసృతంగా తనిఖీలు చేపట్టారు.
టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో చాణక్యను అదుపులోకి తీసుకున్నారు. చాణక్య డ్రగ్స్ ను పుట్టినరోజు సందర్భంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు చాణక్యను అరెస్ట్ చేసి డ్రగ్స్ గురించి విచారిస్తున్నారు. డ్రగ్స్ ను ఎవరు తీసుకొచ్చారు...? డ్రగ్స్ వెనుక ఉన్నదెవరు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. యువకుడిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.
ఈ ఘటనతో హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గతంలో కూడా చాణక్య గోవా నుండి డ్రగ్స్ తెచ్చుకునేవాడని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ను స్నేహితులకు, బయటి వ్యక్తులకు అమ్మే సమయంలో నిందితుడు చాణక్యను పోలీసులు వల పన్ని పట్టుకున్నారని తెలుస్తోంది. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో చాణక్యతో పాటు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు ఇప్పటికే చాణక్య ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని ఫోన్ కాల్స్ ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలుస్తోంది.. పుట్టినరోజులకు, డిసెంబర్ 31 కోసం డ్రగ్స్ ను చాణక్య కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తు తరువాత పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా అతని దగ్గర డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా...? అనే దాని గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. చాణక్య వద్ద నుంచి రూ. 1.20 లక్షల విలువైన 40 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.