
రాజకీయాల్లో ఉన్ననాయకులకు ఓ లక్షణం ఉంది. ఏదైనా రాజకీయంగా ఓ సంఘటన చోటు చేసుకుం టే.. దానికి ఉన్న పూర్వాపరాలను వెంటనే వెల్లడించే లక్షణం చాలా మంది నాయకులకు ఉండదు. కొన్ని సం వత్సాలు గడిచిపోయిన తర్వాత.. సందర్భాన్ని చూసుకుని వాటిని వెల్లడించి సంచలనాలు రేపేస్తుం టారు. అలాంటి సంచలనాత్మక విషయం ఒకటి తాజాగా ఏపీ అసెంబ్లీలో వెల్లడైంది. అది కూడా చంద్రబాబును మై నస్ చేయడం, వైసీపీ నాయకులకు ఆయుధంగా మారడం ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతోంది. విషయం లోకి వెళ్తే.. 2014లో వైసీపీ తరఫున గెలిచిన దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి .. చంద్రబాబుకు జై కొట్టారు.
వీరంతా ఎవరికి వారు తమ దారి తాము చూసుకున్నారని అప్పట్లోనే కథనాలు వచ్చాయి. అనేక విశ్లేష ణ లు కూడా సాగాయి. అయితే, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున విజ యం సాధించిన ఆది నారాయణ రెడ్డి.. అప్పటి వరకు వైఎస్‌ను, జగన్ కూడా భారీ ఎత్తున ఆకాశానికి ఎత్తే సి.. అ నంతరం అనూహ్యంగా చంద్రబాబుకు జై కొట్టారు. ఆ వెంటనే మంత్రి పదవి కూడా వచ్చేసింది. అది కూ డా రామసుబ్బారెడ్డి వంటి బలమైన నాయకుడు వ్యతిరేకించినా కూడా ఆది కి చంద్రబాబు అగ్ర తాంబూలం ఇచ్చారు.
ఇంత జరగడానికి వెనుక ఏం జరిగి ఉంటుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అప్పట్లో నే చర్చకు వచ్చినా.. సమాధానం మాత్రం చాలా కొద్ది మంది వద్దే ఉండి పోయింది. అయితే, తాజాగా బుదవారం నాటి అసెంబ్లీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మా ట్లాడుతూ... ఆదికి-చంద్రబాబుకు మధ్య, అదేసమయంలో ఆదికి-విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డికి మధ్య, ఆది-బాబు-కేశవరెడ్డిల మధ్య ఉన్న బంధాన్ని విడమరిచి మరీ సభకు వివరించడం ఆసక్తిగా మారింది.
కేశవరెడ్డి తన విద్యాసంస్థల్లో చదివే వారి నుంచి కోట్లాది రూపాయలను డిపాజిట్లరూపంలో సేకరించి మోసగించారని, ఇది చంద్రబాబు హయాంలోనే బయట పడిందని, దీంతో ఆయనను అరెస్టు చేశారని, అయితే, కేశవరెడ్డి, ఆది నారాయణ రెడ్డి స్వయానా వియ్యంకుడు కావడంతో ఈ కేసును అడ్డు పెట్టుకుని చంద్రబాబు ఆదిని తన పార్టీలోకి చేర్చుకున్నారు.
ఇక, ఆది కూడా ఇదే కేసును అడ్డు పెట్టుకుని మంత్రి పదవిని కొట్టేశారని, ఇక, కేశవ రెడ్డి పోగు చేసుకున్న సొమ్ములో కొన్ని కోట్లను పార్టీకి ఫండ్‌గా కూడా తీసుకున్నారని, మొత్తంగా ఆదిని వైసీపీకి దూరం చేసుకునేందుకు, జగన్‌ను దెబ్బకొట్టేందుకు బాబు కుట్ర పూరితంగా వ్యవహరించి.. కేశవరెడ్డి సంస్థల్లో డిపాజిట్లు న్న వారికి అన్యాయం చేశారని అంటూ రాచమల్లు.. సున్నితంగానే విమర్శిస్తూ.. సబ్జెక్టును కళ్లకు కట్టడంతో అప్పటి వరకు అసలు కేశవరెడ్డి వెనుకాల ఏం జరిగిందనే విషయం తెలియని వారు సైతం.. విస్మయానికి గురయ్యారు. సో.. ఇదీ ఆది పార్టీ జంప్ వెనకాల ఉన్న స్టోరీ.