ఎన్ని కష్టాలు వచ్చినా మహిళలపై అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. దేశంలో మహిళలకు కనీస రక్షణ కరువై ఎక్కడ చూసినా.. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలే కనిపిస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా మహిళలు కామపు కోరల్లో చిక్కుకుంటున్నారు. ప్రతిచోటా మహిళలకు భద్రత కరువైంది. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెడితే మళ్లీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఉంది నేటి సమాజంలో. . దిశా ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి దారుణ ఘటన మరొకటి చోటుచేసుకుంది.
నవరంగపూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నవరంగపూర్ జిల్లా గుముండల గ్రామం లో శుక్రవారం రాత్రి పర్వ్ జరుగుతుండగా... ఈ పర్వ్ కార్యక్రమాలు చూసి ఓ బాలిక ఇంటికి చేరింది. సుమారు ఎనిమిది గంటల సమయంలో బహిర్భూమి కోసం బయటికి వెళ్ళింది ఆ బాలిక. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక ఎంతసేపటికి ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ బాలిక ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు కుటుంబ సభ్యులకు. అయినా బాలిక ఆచూకీ మాత్రం ఎక్కడ తెలియలేదు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ పొలంలో బాలిక మృతదేహాన్ని గమనించారు.
కాగా బాలిక మృతదేహాన్ని గమనించిన మహిళలు గ్రామస్తులకు సమాచారం అందించారు చేరుతున్న గ్రామస్తులు.. ఘటనా స్థలంలో మృతదేహం పడి ఉన్న తీరు... బాలిక శరీరంపై అక్కడక్కడ గాట్లు ... కొంతదూరంలో జీన్ పాయింట్ లో చెప్పులు ఉండటం చూసి బాలిక పై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని భావించారు . ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చర్యలు ప్రారంభించారు. అయితే శాంతిభద్రతలు నెలకొల్పడానికి డీజీపీ గా నియమితులైన అభయ్ కుమార్ జిల్లాలో మొదటి సారిగా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం.