అసెంబ్లీ సమావేశాలను చూస్తున్న వాళ్ళకి ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. గడచిన వారం రోజుల సమావేశాల్లో చంద్రబాబునాయుడుకి మద్దతుగా కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే మాట్లాడుతున్నారు. ఏ అంశం గురించి చంద్రబాబు మొదలుపెట్టినా మంత్రులు, వైసిపి సభ్యులు విరుచుకుపడిపోతున్నారు. దాంతో  చంద్రబాబుకు మద్దతుగా ముగ్గురు సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరి మాత్రమే అండగా నిలబడుతున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

ఇక్కడే అందరికీ ఓ డౌట్ వస్తోంది. చంద్రబాబును కలుపుకుని  పార్టీకి ఉన్నదే 23 మంది ఎంఎల్ఏలు.  వీళ్ళల్లో పై ముగ్గురు తప్ప మిగిలిన ఎంఎల్ఏలు ఎందుకు నోరిప్పటం లేదు ? అసలు సమావేశాలకు హాజరవుతున్నది ఎంతమంది ?  ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది ఆ ఎంఎల్ఏలు లేకపోతే చంద్రబాబు మాత్రమే.

 

మిగిలిన ఎంఎల్ఏల వ్యవహారమే పార్టీలోను బయటా బాగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలోని నలుగురు ఎంఎల్ఏల్లో ముగ్గురు, విశాఖపట్నం సిటిలోని నలుగురు ఎంఎల్ఏల్లో ముగ్గురు పార్టీ మారటానికి రెడీగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అదే సందర్భంలో గుంటూరు జిల్లా రేపల్లె ఎంఎల్ఏ అనగాని సత్యప్రసాద్ బిజెపి వైపు చూస్తున్నారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది.

 

ఇప్పటికే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ నుండి సస్పెండ్ అవటంతో సభలో స్వతంత్ర సభ్యునిగా కంటిన్యు అవుతున్న విషయం చూస్తున్నదే.  చంద్రబాబుకు స్ట్రాంగ్ సపోర్టరే కానీ విజయవాడ వెస్ట్ ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ రావు సభలో ఎందుకనో  పెద్దగా యాక్టివ్ గా లేరు.  సరే రకరకాల కారణాలతో ఎవరికి వాళ్ళు  సమావేశాలకు గైర్హాజరవటమో లేకపోతే వచ్చినా మాట్లాడకుండా కూర్చోవటమో చేస్తున్నారు.

 

అంటే సొంతపార్టీ ఎంఎల్ఏల నుండే చంద్రబాబుకు సహకారం అందటం లేదు. దాంతో వైసిపి సభ్యుల దాడులను తట్టుకోలేక చంద్రబాబు బాగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిపోతోంది. నిజానికి 23 మంది ఎంఎల్ఏలూ చంద్రబాబుకు గట్టిగా మద్దతుగా నిలబడినా చేయగలిగేదేమీ లేదు. ఎందుకటే అధికార పార్టీ బలం 151 కాబట్టి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: