దాదాపు 37 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు బలహీనపడుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ ఇంత ఘోర పరాజయం సాధించటానికి నారా లోకేశ్ కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ 151 ఎమ్మెల్యే సీట్లతో ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకొనివస్తే లోకేశ్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. 
 
2013 లో లోకేశ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత చంద్రబాబు కృషి వలన లోకేశ్ ఎమ్మెల్సీ కావటంతో పాటు మంత్రి కూడా అయ్యారు. కానీ లోకేశ్ 2019లో ఎదుర్కొన్న తొలి ఎన్నికలోనే ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం తరువాత టీడీపీ నేతలు టీడీపీ పార్టీ ఓటమికి లోకేశ్ కారణమని విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీని వీడిన రాజ్యసభ సభ్యులు కూడా నారా లోకేశ్ కారణంగా పార్టీలో నేతలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. 
 
 టీడీపీలోని కొంతమంది నేతలు లోకేశ్ కనీసం వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేకపోయారని లోకేశ్ కు దొడ్డిదారిలో మంత్రి పదవి కట్టబెట్టారని అన్నారు. గతంలో కొన్ని బహిరంగ సభల్లో లోకేశ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేశాయి. చంద్రబాబు తనయుడు లోకేశ్ కు అవసరానికి మించి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటంతో పార్టీకి నష్టం జరిగిందని కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. 
 
చంద్రబాబుకు లోకేశ్ ఓడిపోతాడని ముందే తెలుసని అందువలనే ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేయకుండా లోకేశ్ తో పోటీ చేయించారని వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కావటానికి లోకేశ్ కూడా ఒక కారణమనే అభిప్రాయం ప్రజల నుండి వ్యక్తమవుతోంది. చంద్రబాబు కొడుకు మీద చూపించిన అతి ప్రేమే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి కారణమని టీడీపీకి చెందిన నేతలే ఎన్నికల ఫలితాల తరువాత బహిరంగంగా విమర్శలు చేయడం గమనార్హం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: