ఇటీవల పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం తెలిపిన రోజు నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిబెంగాల్, ఢిల్లీల్లో ఆందోళనలు చాల ఎక్కువగా చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఆమోదం పలికిన చట్టం లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ బిల్లు రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కల్పించే సమానత్వ హక్కును వ్యతిరేకిస్తోంది అని కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ(ఎం), ఎంఐఎం, టీఆర్ఎస్ తదితర రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఈ తరుణంలో అసలు ఎందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది అని అనుకుంటారా.... అసలు ఈ చట్టం వల్ల భారతీయులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అని తెలుసుకుందామా మరి.....
భారత దేశానికీ పొరుగున ఉన్న పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్.. ఇస్లామిక్ దేశాలు. ఈ మూడు దేశాల్లో ముఖ్యంగా హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్శీలు మైనార్టీలు ఉన్నారు. ఈ 3 దేశాల్లో హింసకు గురైన పైన తెలిపిన ఆరు మతాలకు చెందిన జనాలు కొందరు ఉన్నారు.. మతపరమైన హింసకు గురై మన దేశానికి శరణార్థులుగా రావడం జరిగింది. ఇలాంటి వారి కోసమే భారత పౌరసత్వం కల్పించడం కోసం ఈ చట్టాన్ని తీసుకోని రావడం జరిగింది. గతంలో భారత్‌లోకి 2014 డిసెంబర్ 31లోగా శరణార్థులుగా వచ్చిన వారికి మాత్రమే భారత పౌరసత్వం లభించడం జరుగుతుంది అని చట్టం తెలియచేస్తుంది. గతంలో భారత్‌లో 11 ఏళ్లుగా శరణార్థులుగా ఉంటున్న వారికే భారత పౌరసత్వం ఇవ్వడం జరిగింది..కానీ ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు తగ్గించడం జరిగింది.
వాస్తవానికి 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం అక్రమంగా వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందడానికి అర్హులు కాదు. వీరిలో ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారు లేదా వీసా గడువు ముగిసినా దేశంలో నివాసం ఉన్న వారిని అక్రమ వలసదారులుగా గుర్తించడం జరిగింది. ఇక ఒక వేళా వీసా గడువు అయిపోయినా.. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలకు సరిగ్గా లేకున్నా.. ముస్లిమేతర శరణార్థులు దేశంలో నివసించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది... 2015లో పాస్‌పోర్ట్ అండ్ ఫారినర్స్ చట్టాలకు కేంద్రం మార్పులు చేయడం జరిగింది.