ఇటీవల అసెంబ్లీ వింటర్ సెషన్ ఆంధ్రాలో హీట్ పెంచడం జరిగింది.. గత ఏడు రోజుల పాటు కొనసాగిన సమావేశాల్లో చర్చలు  రసవత్తరంగా కొనసాగాయి. ఇక అధికార - ప్రతిపక్షాల పార్టీల  మధ్య మాటల యుద్ధంతో.. సభ వాడీ -వేడిగా జరిగింది. ఇక అసెంబ్లీలో మొత్తం 22 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది.. అన్నిటికి కూడా ఆమోదం తెలపడం చాల గమనార్ధకమైన విషయం అనే చెప్పలి. అధికారంలోకి  వచ్చిన  తొలి ఆరు నెలల్లో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాల్లో 19 బిల్లులు.. రెండో అసెంబ్లీ సమావేశాల్లో 22 బిల్లులు ఆమోదం పొందటం చాలా హర్షం వ్యక్తం చేసే విషయం అనే చెప్పలి.

 

తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు  ప్రతిపక్షం టీడీపీ పార్టీ చేసిన ఉల్లి రగడ మాత్రం  ప్రతిపక్షానికి ఒక పెద్ద మైనస్ అయ్యింది. ఇక  సభలో మహిళల రక్షణ కోసం ప్రతిష్టాత్మకమైన దిశ బిల్లుపై చర్చ కొనసాగుతుంటే చంద్రబాబుకు ఉల్లి ముఖ్యమైందా అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఇక రెండో రోజు సన్నం బియ్యంపై జగన్ యూటర్న్ అంటూ టీడీపీ పార్టీ ఆరోపణలు మొదలు పెట్టగా.. రాష్ట్రానికి నాణ్యమైన బియ్యం ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, మంత్రులు వివరించడం జరిగింది.  ఇక మూడోరోజు ఐతే సచివాలయాల విషయంపై  వాడీ-వేడి చర్చ కొనసాగింది. ఇక ఈ  అధికారంలోకి  వచ్చిన నాలుగు నెలల్లోపే 4లక్షల  ఉద్యోగా అవకాశాలు కల్పించాము అని  సీఎం జగన్ తెలియచేయడం జరిగింది.

 


ఇక అసెంబ్లీలో  నాలుగో రోజు ఇంగ్లీష్ మీడియంపై చర్చ జరిగింది.. ఇంగ్లీష్ మీడియంపై  నిర్ణయానికి ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది. దీనితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమీషన్ బిల్లును, వాయిస్ ఓట్ ద్వారా ఎక్సైజ్, ఎండోమెట్ బిల్లుల్ని సభ ఆమోదం తెలియచేయడం జరిగింది. ఇక ఐదో రోజు మహిళల రక్షణ కోసం సీఎం జగన్ తీసుకున్న చారిత్రాత్మక దిశ బిల్లు సభలో ప్రవేశ పెట్టడం జరిగిది. ఈ బిల్లు ద్వారా మహిళలపై అత్యాచారం కేసుల్లో 7 రోజుల్లో విచారణ, 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టం తీసుకొని రావడం జరిగింది. ఇక జిల్లాకు  కేసుల విచారణకు ఒకటి చొప్పున మొత్తం 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయాలి అని కోరడం జరిగింది.

 

ఆరోరోజు సభలో మాత్రం  కీలకమైన 16 బిల్లులు ఆమోదం లభించింది. దీనితొ పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో విద్య, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి అనుమతించడం, ఎస్సీ, ఎస్టీ కమీషన్‌లు, మద్యపాన నిషేధ చట్టంలో సవరణ పాటు ఇతర బిల్లులకు ఆమోదం లభించింది. ఇక ఈ బిల్లులపై జరిగిన చర్చల్లో ప్రతిపక్ష టీడీపీ మాత్రం పెద్దగా విమర్శలు చేయలేదు అంటే నమ్మండి.

మరింత సమాచారం తెలుసుకోండి: