ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి అధికారులనుఏసీబీ అధికారులు ఆటపట్టిస్తున్నారు రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఇద్దరు అధికారులు ఏసీబీకి వలకు దొరకడం జరిగింది. నేడు తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ ఎస్సై రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా అడ్డంగా దొరికిపోయాడు. ఈ లక్ష గురించి ఆరా తీయడం మొదలు పెడితే  ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటపడింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు అయ్యింది వ్యవహారము.

 

   ఈ కేసుకు సంబంధించి విషయము ఏమిటంటే సత్యవేడు మండలం శ్రీసిటీ ఎస్సై సుబ్బారెడ్డి బాధితుడ్ని ఏకంగా రూ.లక్ష రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఒకేసారి లక్ష రూపాయలు లంచం అడగడం చాలా బాధ అనిపించింది అతనికి. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. పక్కాగా ప్లాన్ వేసిన సీఐ విజయ్ శేఖర్, ఏసీబీ అధికారులు. చేపకు ఎర వేసినట్టుగా ఎస్సై సుబ్బారెడ్డికి రూ.లక్ష లంచంగా ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగినది. అయినా ఎస్సై ఒప్పుకోలేదు. కానీ అవినీతి అధికారి చేతి వేళ్లకు కెమికల్ అంటుకున్నట్టు పరీక్షలో రుజువు అయినది.సదరు అధికారుల వద్ద నుంచి ఆ డబ్బును ఏసీబీ అధికారులు రికవరీ చేశారు.

 

ఎస్సై సుబ్బారెడ్డిపై చాలా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా సామాన్య ప్రజలు ఎస్ఐ మీద చెప్పడానికి భయ పడినట్లు తెలిసినది.ఆయన కొన్ని కేసుల్లో, ఇసుక మాఫియాకు సహకరిస్తున్నట్లు కూడా తెలుసినది.. దీంతో ఎస్సై ఆస్తులపైనా కూడా డా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రెండు రోజుల సమయంలో ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఇలా లంచాలు తీసుకుంటూ దొరికిపోవడం సంచలనం రేపింది. ఇంత మంచి ఉద్యోగాలు పెట్టుకొని కూడా అవినీతిని వీరే ప్రోత్సహించడం ఎంతవరకు భావ్యము. ఇలాంటి అధికారులను చూసి మిగతా అధికారులు ముక్కున వేలేసుకుంటారు. పోలీసు వ్యవస్థలో చాలామంది ఇలా వ్యవహరించడం సాధారణమైన విషయంగా చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: