టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో రెండో రోజు పర్యటనలో మాట్లాడుతూ నేను వైసీపీ ఉండకూడదనుకుంటే ఒక్కరు కూడా మిగిలేవారు కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులను చంద్రబాబు ఖండించారు. యుధ్ధానికి వస్తే ఎవరి బలమెంతో తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. మహాత్మగాంధీ స్పూర్తితో ముందుకెళతామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని పోలీసులు కేసులు తీసుకోవటం లేదని అన్నారు. 
 
అలిపిరి ఘటనలో వేంకటేశ్వరస్వామి తనను కాపాడారని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీని లేకుండా కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. టీడీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోయాయని చెప్పారు. ప్రజావేదిక నుండే ప్రభుత్వ విధ్వంసం మొదలైందని అన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ లో ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశానని చంద్రబాబు చెప్పారు. 
 
చలో ఆత్మకూరుకు పిలుపునిస్తే మా ఇంటి గేటుకు తాళం వేశారని మాజీ ముఖ్యమంత్రి అయిన తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే జగన్ సామాన్య ప్రజానీకంను బ్రతకనిస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. జగన్ ఉన్మాది అని జగన్ కు అధికారం పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్టుగా అయిందని అధికారం ఇస్తే అందరినీ కొడుతున్నాడని భష్మాసుర హస్తంలా ఆయనను కూడా కొట్టుకుంటున్నాడని అన్నారు. 
 
అధికారులను, పోలీస్ ఆఫీసర్లను చట్టాన్ని గౌరవించాలని కోరుతున్నానని చెప్పారు. చట్టాన్ని గౌరవించకుండా చట్టాన్ని అతిక్రమిస్తే అధికారులు, ప్రజా ప్రతినిధుల వెంట పడతానని చంద్రబాబు అన్నారు. చట్ట ఉల్లంఘన ఎవరు చేసినా శిక్షలు పడతాయని ఆ విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. చంద్రబాబు జగన్ ది భష్మాసుర హస్తం అని జగన్ తన నెత్తిన తానే చేయి పెట్టుకుని భస్మమైపోతాడనే అర్థం వచ్చే విధంగా విమర్శలు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: