గత టిడిపి ప్రభుత్వ హయాంలో విశాఖ కేంద్రంగా భారీ భూ కుంభకోణం జరిగిందని, దీంట్లో ప్రధాన ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు అని అనకాపల్లి ఎమ్మెల్యే, వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. తమ ప్రభుత్వం భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను నియమించిందన్నారు. మూడు నెలల్లో ఫిర్యాదు లు స్వీకరించి దోషులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2014 హుదూద్‌ తుపాను సందర్భంగా విశాఖకు వచ్చిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే 20 వేల ఎకరాల వరకూ భూముల ట్యాంపరింగ్‌ జరిగాయని ఆరోపించారు.

 

ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో 2,500 ఎకరాలను విశాఖ జిల్లాలో టిడిపి అధినేత చంద్ర బాబు సేకరించారని విమర్శించారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌ ఆంధ్రా బ్యాంకులో రూ.13 కోట్లు రుణం తీసుకుని ఎగనామం పెట్టడానికి సిద్ధమయ్యాడని ఆరోపిం చారు. ఇండియన్‌ బ్యాంకు దగ్గర రూ.వందల కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టిన గంటా శ్రీనివాసరావు దారిలోనే టిడిపి నేతలు పయనిస్తున్నారని విమర్శించారు.


అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు . విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణాలపై పూర్తి విచారణ జరిపిస్తామని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు . భూ కుంభకోణం వ్యవహారంలో సంబంధం ఉన్న అధికారులు గానీ ప్రజాప్రతినిధులను గానీ విడిచి పెట్టమని హెచ్చరించారు.

 

భూకుంభకోణంలో ఎంతటి వారు ఉన్నా వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణాలపై పూర్తి విచారణ జరిపిస్తామని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు . భూ కుంభకోణం వ్యవహారంలో సంబంధం ఉన్న అధికారులు గానీ ప్రజాప్రతినిధులను గానీ విడిచి పెట్టమని హెచ్చరించారు. భూకుంభకోణంలో ఎంతటి వారు ఉన్నా వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు . గుడివాడ అమర్‌నాథ్ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు .


హుధుద్ తుఫాన్ కంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లనే విశాఖ నగరానికి ఎక్కువ నష్టం వాటిల్లిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ బుధవారం ఆరోపించారు. హుధుద్ తుఫాను సంభవించి నేటికి రెండేళ్లు ముగిసినా ప్రజలకు ఎలాంటి సాయం అందలేదని ఆరోపించారు. నేటికి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఆ తుపాను వల్ల రూ.లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రధాని నరేంద్ర మోడీ కి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. దీంతో రూ.వెయ్యి కోట్ల ఇస్తానన్న ప్రధాని కేవలం రూ.480 కోట్ల ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసరాల కోసం రూ.450 కోట్ల ఖర్చు చేశామని చెప్పిందని, ప్రపంచ స్థాయిలో సేకరించిన నిధుల్లో ఒక్క పైసా కూడా పట్టణానికి ఖర్చు చేయలేదన్నారు. చంద్రబాబు ఒక మాటల మోసగాడని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నట్లు జబ్బులు చరుసుకుంటున్నారే తప్పా ఏ పనికి ఆయన పనికి రారని విమర్శనాస్త్రాలు సంధించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: