హైదరాబాద్ షాద్నగర్లో దిశ అనే వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమాయకురాలిని వైద్యురాలు దిశ ను అత్యాచారం హత్య ఘటన కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసారు. దిశ కేసులో నలుగురు నిందితులు ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది. దిశ కేసులో నలుగురు నిందితులు ఎన్కౌంటర్ పై దేశవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి . ఆడపిల్లలపై అత్యాచారం చేస్తే ఇలాంటి శిక్షలు కరెక్ట్ అంటూ సమర్థిస్తూ ఉంటే... దిశా కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ ముమ్మాటికీ చట్ట విరుద్ధమంటూ వ్యతిరేకిస్తున్నారు.
అయితే దిశ కేసులోని నలుగురు నిందితులకు కుటుంబాలు కూడా ఒక ఆడపిల్ల కోసం ముగ్గురు ప్రాణాలు తీసేస్తారా... మా వెనక ఎవరూ లేరని... ఎవరూ అడగరనె కదా పోలీసులు అధికారులు ఎన్కౌంటర్ చేశారు అంటూ ఆగ్రహం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కుటుంబీకులకు దిశా నిందితుల మృతదేహాలను అప్పగించలేదు. ఎన్కౌంటర్ పై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. కేసులో నలుగురు నిందితులు ఎన్కౌంటర్ ఘటన తర్వాత మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నిందితుల తరపున కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాయి నలుగురు నిందితులు కుటుంబాలు . ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఎన్కౌంటర్ ఘటనపై దర్యాప్తు చేయాలని... దిశా కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసు లపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు నిందితుల ఎన్కౌంటర్ పై జరిపేందుకు సుప్రీమ్ కోర్టు కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కమిటీ విచారణ జరిపే వరకు నిందితులు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించినది . అయితే కడ చూపుకైనా నోచుకోనివ్వండి అంటూ కుటుంబీకులు అధికారులను కోరుతున్నారు.