దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో వ్యాపారవేత్తలు లైంగిక వాంఛలు తీర్చుకోవడం కొరకు భార్యలను మార్పిడి చేసుకుంటున్న ఘటన కలకలం రేపుతోంది. ఒక వ్యాపారవేత్త భార్య తన భర్త మద్యం సేవించి తన స్నేహితులతో పడుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని, వీడియోలను తీసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయటంతో బాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడి భర్తను, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పూర్తి వివరాలలోకి వెళితే ముంబైలో ఒక వ్యాపారవేత్త, అతని భార్యతో పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల పాటు అన్యోన్యంగానే ఉన్నాడు. కానీ సంవత్సరాలు గడిచిన తరువాత అతని నిజస్వరూపం బయటపెట్టాడు. తోటి వ్యాపారవేత్తలతో అతను మన భార్యలను మార్చుకొని ఎందుకు లైంగిక కోరికలు తీర్చుకోకూడదు అని చర్చలు మొదలుపెట్టాడు. వ్యాపారవేత్తలు చర్చించుకొని ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారు. 
 
వాపారవేత్త అతని భార్యను బెదిరించి అతని స్నేహితుడి దగ్గరకు పంపించాడు. ఆ తరువాత వ్యాపారవేత్త రహస్యంగా వీడియోలను తీసి భార్యను బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. తాను చెప్పిన వ్యాపారవేత్తల దగ్గరకు వెళ్లాలని లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. భర్త బెదిరింపులతో విసిగిపోయిన ఆ మహిళ తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయం అంతా చెప్పి వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా ఈ వ్యవహారం జరుగుతోందని గుర్తించి వ్యాపారవేత్తను, అతని ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి నిందితులను ఈ నెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ఈ భార్యల మార్పిడి దందా గురించి పూర్తి విచారణ చేస్తున్నామని మోసపోయిన అమాయకపు మహిళల వివరాలు ఆరా తీస్తున్నామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: