ప్రస్తుత రోజులో ప్రైవేట్ ఆస్పత్రిలో చాల దారుణాలు జరుగుతున్నాయి. ఇలా జరగడానికి ముఖ్య కారణం డాక్టర్ల  నిర్లక్ష్యం అనే చెప్పాలి. ప్రాణాలు కాపాడవలసిన  డాక్టర్ల  పసి పిల్లల ప్రాణాలు తీసున్నారు అంటే నమ్మండి. తాజాగా ఈలాంటి సంఘటన తెలంగాణాలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని స్థానిక ఆస్పత్రిలో సంఘటన  చోటు చేసుకోవడం జరిగింది. డాక్టర్ ఓ  ఆస్పత్రిలో డెలివరీ సమయంలో చూపిన నిర్లక్ష్యం ఇంకా భూమిపై కూడా అడుగు పెట్టని  శిశువు మరణానికి కారణం అయ్యాడు. ఇక పూర్తి వివరాలు ఇలా...సిజేరియన్ చేస్తున్న సమయంలో శిశువు తలను కోసేశాడు డాక్టర్. ఇలా జరగడంతో తల్లి గర్భంలోనే ఉండి పోయాడు చనిపోయిన శిశువు. ఇక గర్భంలోనే శిశువు చనిపోవడంతో తల్లి పరిస్థితి చాలా విషమించిది. 

 

వెంటనే హుటా హుటిగా ఆమెను హైదరాబాద్‌కు తరలించారు స్థానికులు. ఇక ఇలా జరగడంతో విధి నిర్వహణలో డాక్టర్ నిర్లక్ష్యం చూపడం కారణంతో బంధువులు డాక్టర్ పై ఆగ్రహంతో మండిపడ్డారు. ఇక బంధువులు ఆస్పత్రిపై రాళ్లు రువ్వి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడం జరిగింది. ఇక బాధితురాలి బంధువులు తెలిపిన  వివరాల ప్రకారం.. డెలివరీ కోసం ఓ గర్భిణీని ఆస్పత్రికి తీసుకొని రావడం జరిగింది. ఆమెను పరిశీలించిన డాక్టర్లు.. అవసరమైన వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. తర్వాత ఆపరేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. దాదాపు రెండు గంటలు ముగిసిన తర్వాత, శిశువు చనిపోయినట్లు వైద్యులు సిస్టర్లతో చెప్పిచ్చినట్లు  బంధువులు తెలియచేయడం జరిగింది.

 

ఇక అచ్చంపేటలో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. ఇలా డెలివరీ సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న డాక్టర్లపై తగిన  చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఇలాంటి  డాక్టర్లపై ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకుందో అని వేచి ఉండాలి మరి. ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇంకా భూమి మీదకు రాని ఆ శిశువు మరణించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: