ఇటీవల నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న వేళ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా  సీసీఏకు సంబంధించి నిబంధనలు, విధివిధానాలు పూర్తిగా ఖరారు అవ్వలేదు అని మంత్రి కిషన్‌రెడ్డి తెలియచేయడం జరిగింది. 

 

ఇది ఇలా ఉండగా ప్రతిపక్షాలు మాత్రం అవాస్తవ  ప్రచారం జరుపుతున్నారు అని విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నాయని అని మండి పడడం జరిగింది. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన అనంతరం చట్టం నిబంధనలపై ప్రతీ ఒక్కరితో చర్చ నిర్వహించి.. అర్హులకు మాత్రమే ప్రయోజనం వచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే  దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు గురించి కేంద్ర ప్రభుత్వం  ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు అని  స్పష్టంగా తెలియచేయడం జరిగింది. 

 

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ... బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై ఐకరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి అని అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో బాగా బలహీనంగా ఉండడం.. కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వెళ్లిపోతున్నా కారణంగా మమత భయాందోళనలో ఉన్నారు. అందుకే ఇలా మాట్లాడు తుంది అని కిషన్‌రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.

 

కిషన్‌రెడ్డి  మాట్లాడుతూ... ‘అసలు మమత ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా అర్థం అవుతుందా. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరుకు కరెక్ట్ అని ప్రశ్నించడం జరిగింది. అలాగే  సీఏకు దేశ పౌరుల ప్రయోజనాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.. కనుకా ఆందోళనకారులు నిరసన విరమించాలని అని కిషన్‌రెడ్డి కోరడం జరిగింది.  ఇక మొత్తానికి ఏమి జరుగుతుందో అర్థం అవ్వడం లేదు అని పలు కార్యకర్తలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: