రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదననే జీఎన్ రావు తన కమిటి రిపోర్టులో ఇచ్చిందా ? కమిటి మీడియాలో చెప్పిన విషయాలను చూస్తుంటే అలాగే ఉంది.  వైజాగ్ లో రాజధాని, తుళ్ళూరులోనే అసెంబ్లీ, కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించింది.  కాకపోతే తుళ్ళూరు, విశాఖపట్నంలో హై కోర్టు బెంచిలను ఏర్పాటు చేయాలని సూచించింది.

 

అలాగే విశాఖపట్నంలో  సచివాలయాన్ని ఏర్పాటు చేసినట్లే వేసవి కాలంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించటం గమనార్హం.  తుళ్ళూరులో వర్షాకాల సమావేలు నిర్వహించేందుకు, కర్నూలులో శీతాకాల సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించటం గమనార్హం. అంటే పై ప్రాంతాల్లోను అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పింది. చంద్రబాబునాయుడు సిఎం అయిన కొత్తల్లో విశాఖపట్నంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా గుర్తించినట్లు కమిటి చెప్పింది.  మొత్తం మీద చిన్న చిన్న విషయాలు అనేకం ఉన్నా హోలు మొత్తం మీద జీఎస్ రావు కమిటి గతంలో శివరామకృష్ణన్ కమిటి నివేదికనే గుర్తు చేసినట్లు అనిపిస్తోంది. శివరామకృష్ణన్ కమిటి కూడా వరదముంపు లేని ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు జరగాలని చేసిన సూచన అందరికీ గుర్తుంటే ఉంటుంది. ఇదే విషయాన్ని ఇపుడు జీఎస్ రావు కమిటి కూడా సిఫారసు చేసింది. 2 వేల మంది రైతులతో మాట్లాడినట్లు చెప్పారు. 38 వేల రెప్రజెంటేషన్స్ వచ్చినట్లు తెలిపారు.

 

ఉత్త, మధ్య ధక్షిణ కోస్తా, రాయలసీమ జోన్లుగా వర్గీకరించినట్లు రావు తెలిపారు. కర్నాటక తరహాలో ప్రాంతీయ బోర్డులను నియమించి అభివృద్ధి చర్యలు తీసుకోవాలని సూచించింది.  13 జిల్లాల్లోని కలెక్టర్లు, రెవిన్యు అధికారులతో పాటు ఆయా ప్రాంతాల్లోని సామాజిక వేత్తలను, వివిధ రంగాల్లోని  నిపుణులను కలిసినట్లు రావు తెలిపారు.  మొత్తం మీద అసెంబ్లీలో జగన్  చేసిన ప్రతిపాదన లాగే ఇపుడు జీఎస్ రావు కమిటి నివేదిక ఉంది. కాబట్టి ఇక అధికారికంగా జగన్ ప్రకటించటమే మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: