ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధాని రగడ భగ్గుమన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని అందుకే రాష్ట్రంలో మూడు రాజదానులు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారింది. అయితే తాజాగా రాజధాని అధ్యయన కమిటీ సీఎం జగన్ జగన్ కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో కమిటీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన 3 రాజధానిల ఏర్పాటు నిర్ణయాన్ని సమర్థించటంతో పాటు... అమరావతి నిర్మాణం ప్రాంతంగా పరిగణించింది కమిటీ. అయితే జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై రాజధాని రైతులు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ వ్యాఖ్యానించడంపై రాజధాని రైతులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే గత రెండు రోజులుగా అమరావతి రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రాజధాని భవిష్యత్తు కోసం తాము పంటపొలాలను త్యాగం చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం చేశారు అంటూ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రాజధాని రైతులు అందరూ ఒక్కసారిగా భగ్గుమన్నారు. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ ఎందుకు వాగ్దానాలు చేశాడు అంటూ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతి లో ముంపు వస్తుందని కమిటీ సభ్యులు నివేదికలో తెలిపారని మరి విశాఖ పరిస్థితి ఏమిటంటారు అని రాజధాని రైతుల ప్రశ్నించారు. జగన్ రైతులకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులందరూ ఎప్పుడంటే అప్పుడు ఆత్మహత్యలు చేసుకోవచ్చని జీవోను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకురావాలంటు ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని .. జగన్ సర్కార్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఈ జన్మలో జగన్ ముఖ్యమంత్రి కాబోడు అంటూ దుమ్మెత్తి పోశారు రాజధాని రైతులు. వైసిపి ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోవడం ఖాయమని శాపనార్థాలు కూడా పెట్టారు. జిఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అనంతరం రాష్ట్రంలో రాజధాని అందరూ ఒక్కసారిగా ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.