2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలలో వైసీపీ పార్టీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ విశ్లేషకులు, మీడియా ఛానెళ్ల అంచనాలకు కూడా అందని మెజారిటీని సాధించి జగన్ ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. దాదాపు 40 సంవత్సరాల చంద్రబాబు అనుభవం సీఎం జగన్ ఛరిష్మా ముందు వెలవెలబోయింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమైతే జనసేన పార్టీ కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. 
 
2019 ఎన్నికల్లో జగన్ ఛరిష్మా ఎంతలా పని చేసిందంటే చాలా నియోజకవర్గాల్లో తొలిసారి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో అనుభవం ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా వైసీపీ నుండి తొలిసారి పోటీ చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓడించారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడంటే జగన్ ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. 
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే వైసీపీ పార్టీ ప్రభంజనం సాధించవచ్చని అంచనా వేసి రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేశాడు. కానీ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. దశాబ్దాల అనుభవం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా టీడీపీ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. జగన్ 2019 ఎన్నికల ఫలితాలతో దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేశారు. 
 
ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పలు పథకాల పేర్లతో డబ్బులను ప్రజలకు పప్పూబెల్లాల్లా పంచిపెట్టింది. 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు 47 సంవత్సరాల జగన్ తన ఛరిష్మాతో చుక్కలు చూపించాడు. జగన్ ఆరు నెలల పరిపాలన అనుభవంపై దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు, టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నా ప్రజలు ఆ విమర్శలను కూడా పట్టించుకోవడం లేదంటే జగన్ ప్రజల్లో ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడో అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: